వాసుదేవరెడ్డిపై సీఐడీ కీలక నిర్ణయం..!!
ఏపీలో సీఐడీ మద్యం కుంభకోణం పై విచారణ చేస్తోంది. గత అయిదేళ్ల కాలంలో చోటు చేసుకున్న మద్యం అమ్మకాలు..ఆరోపణల పైన ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే వాసుదేవరెడ్డి విచారణ మొదలైంది. అయితే, ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నారు. మద్యం కుంభకోణంలో ఆయన కేంద్రంగా వ్యవహారం మొత్తం సాగిందని సీఐడీ భావిస్తోంది. దీంతో...వాసుదేవరెడ్డి పైన సీఐడీ కీలక నిర్ణయం తీసుకుంది.
మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) గత ఎండీ, ఐఆర్‌టీఎస్ అధికారి వాసుదేవరెడ్డి నెలన్నర రోజులుగా పరారీలో ఉన్నారు. ఇప్పటికే పలు అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయన కోసం సీఐడీ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. వాసుదేవరెడ్డి విదేశాలకు వెళ్లే అవకాశం ఉందన్న సమాచారంతో లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. అజ్ఞాతంలో ఉన్న ఆయన మరోవైపు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు తన న్యాయవాదులతో హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

విజయవాడలోని ఏపీఎస్‌బీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి కీలక ఫైళ్లు, కంప్యూటర్ పరికరాలు, ఇతర కీలక పత్రాలు చోరీ చేశారన్న ఫిర్యాదుతో జూన్ 6న సీఐడీ అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాతి రోజే హైదరాబాద్‌లోని వాసుదేవరెడ్డి ఇంట్లో సీఐడీ సోదాలు నిర్వహించింది. అప్పటికే ఆయన పరారయ్యారు. మద్యం అమ్మకాలు,అక్రమాల పైన తాజాగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేసారు. అక్రమాలు జరిగినట్లు ప్రాధమికంగా తేలిందన్నారు. నాసిరకం మద్యం, అమ్మకాల్లో అవకవతకలపైన ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది.












Click it and Unblock the Notifications