Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సినిమా టికెట్లు ఇక ప్రభుత్వానివే : అన్ని సినిమాలు- థియేటర్లు సర్కార్ చేతిలో: మెగాస్టార్ మీదే భారం..!!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొంత కాలంగా సినిమా టిక్కెట్ల ధరల విషయంలో ప్రభుత్వ అనుమతుల పైన చర్చ నడుస్తోంది. సాధారణంగా ప్రముఖ హీరోల సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరలు పెంపు..ప్రత్యేక షో ల ప్రదర్శనకు అనుమతి జిల్లా స్థాయిలో జరిగేది. అయితే, వకీల్ సాబ్ సినిమా విడుదల సమయంలో ఏపీ ప్రభుత్వం దీనికి భిన్నంగా నిర్ణయం తీసుకుంది. టిక్కెట్ల ధరలు పెంపుకు అనుమతి ఇవ్వలేదు. ఆ సమయంలో ఎగ్జిబిటర్లు కోర్టుకు వెళ్లగా..మూడు రోజుల పాటు మాత్రమే అనుమతి ఇస్తూ ఉత్తర్వులు వచ్చాయి.

ప్రభుత్వ నిర్ణయంతో సినీ ఇండస్ట్రీలో అలజడి

ప్రభుత్వ నిర్ణయంతో సినీ ఇండస్ట్రీలో అలజడి

ఇక, ఆ తరువాత ప్రభుత్వం తమ అనుమతి లేకుండా టిక్కెట్ల ధరలు పెంచటానికి వీళ్లేదంటూ నిర్ణయం తీసుకుంది. జిల్లా జాయింట్ కలెక్టర్లకు ఉన్న అధికారాల్లో మార్పులు చేసింది. టిక్కెట్ల ధరల పెంపు అంశంలో ప్రభుత్వ అనుమతితోనే నిర్ణయం తీసుకోవాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, ఇటువంటి నిర్ణయాలు..ఇండస్ట్రీ ఈ విషయంలో ఏం కోరుకుంటుందనేది సీఎం జగన్ కు వివరించటానికి మెగాస్టార్ చిరంజీవి నాయకత్వంలో టాలీవుడ్ ప్రముఖులు సిద్దం అయ్యారు. వారు ఈ వారంలో సీఎం జగన్ ను కలిసే అవకాశం ఉంది.

రైల్వే టిక్కెట్ల తరహాలోనే సినిమా టిక్కెట్లు

రైల్వే టిక్కెట్ల తరహాలోనే సినిమా టిక్కెట్లు

ఇదే సమయంలో ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడు తరహాలోనే ప్రత్యేక వెబ్ సైట్ ద్వారా సింగిల్ స్క్రీన్ టు మల్టీ ప్లెక్స్ వరకు అన్ని ధియేటర్లు-అందరి సినిమాల విక్రయానికి ఒక పోర్టల్ సిద్దం చేస్తోంది. దీని ద్వారా మాత్రమే రాష్ట్రంలోని అన్ని ధియేటర్ల టిక్కెట్లు విక్రయించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన బాధ్యతలు ఎఫ్‌డీసీ కి అప్పగించింది. ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ రైల్వే ఆన్ లైన్ బుకింగ్ తరహాలో సినిమా టిక్కెట్లు బుకింగ్ కు సంబంధించి ఈ పోర్టల్ ఏర్పాటుకు సూచనలు-సలహాలు ఇవ్వనుంది.

సినిమా టిక్కెట్ల పైన పూర్తిగా ప్రభుత్వ నియంత్రణ

సినిమా టిక్కెట్ల పైన పూర్తిగా ప్రభుత్వ నియంత్రణ

దీని ద్వారా ఇప్పటి వరకు సినిమా టికెట్ల ధరల అంశం నిర్మాతలు-పంపిణీ దారులు-సినిమా హాళ్ల యాజమన్యం చేతుల్లో ఉండేది. ఈ నిర్ణయ అమలైతే ఈ అధికారం ప్రభుత్వం పరిధిలోకి వెళ్తుంది. ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరల నియంత్రణ..అజమాయిషీకి పరిమితం కావాలి కానీ, ఇలా ప్రభుత్వమే టిక్కెట్లు విక్రయించేందుకు ముందుకు రావటం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే పలు వెబ్ సైట్లు.. యాప్ ల ద్వారా సినిమా టిక్కెట్ల విక్రయాలు సాగుతున్నాయి. అవి ప్రముఖ ధియేటర్లకే పరిమితం అయ్యాయి.

సింగిల్ స్క్రీన్ టు మల్టీప్లెక్స్ వరకూ

సింగిల్ స్క్రీన్ టు మల్టీప్లెక్స్ వరకూ

ప్రభుత్వం తీసుకొచ్చే వెబ్ సైట్ లో రాష్ట్రంలోని ఏ, బీ, సీ సెంటర్ల లో.. ఏ థియేటర్లో సినిమా చూడాలన్నా ప్రభుత్వ పోర్టల్‌ ద్వారానే టికెట్‌ కొనాలి. స్మార్ట్‌ ఫోన్‌, గూగుల్‌పే, నెట్‌ బ్యాంకింగ్‌ లేదు.. మేం థియేటర్‌కు వెళ్లి క్యూలో నిలబడిటికెట్‌ కొంటాం అంటే కుదరదు. పల్లెటూరులోని సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్‌ నుంచి నగరాల్లోని మల్టీప్లెక్స్‌ల దాకా ప్రభుత్వ పోర్టల్‌ నుంచే టికెట్లు కొనాలి. ఎవరైనా నేరుగా థియేటర్‌కు వెళితే... బుకింగ్‌ కౌంటర్‌ సిబ్బంది ప్రభుత్వ పోర్టల్‌ ద్వారానే టికెట్‌ తీయించే పరిస్థితి కల్పించే అవకాశముంది.

ప్రభుత్వం చేతిలోకి సిని పరిశ్రమ ఆయువు పట్టు

ప్రభుత్వం చేతిలోకి సిని పరిశ్రమ ఆయువు పట్టు

దీనిద్వారా థియేటర్ల యజమానులు, సినిమా పరిశ్రమను కూడా గుప్పిట్లో పెట్టుకునే స్కెచ్‌ వేసిందన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. అయితే, వాస్తవంగా టిక్కెట్ ధరకే విక్రయాలు చేస్తారా.. లేక సర్వీసు ఛార్జ్ వసూలు చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. అయితే, ఈ నిర్ణయం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కరోనా దెబ్బకు సినీ పరిశ్రమలని ప్రతీ విభాగం ఇప్పుడు నష్టాల్లో ఉన్నాయి. ఓటీటీ పోటీ తట్టుకోలేక కొంత మంది సినిమా వ్యాపారం నుంచి బయటకు వెళ్లే ఆలోచనలు చేస్తున్నారు.

మెగాస్టార్ పైనే ఇప్పుడు భారం

మెగాస్టార్ పైనే ఇప్పుడు భారం

సినీ పరిశ్రమను ఓటీటీ వ్యాపారం దెబ్బ తీయగా.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమకు పూర్తిగా సహకరిస్తామని చెబుతూ..ఈ నిర్ణయం ఏంటనే ప్రశ్న మొదలైంది. అయితే, సినీ పరిశ్రమకు సంబంధించి ఏ సమస్య ఉన్నా తన వద్దకు వచ్చి వివరించాలని..పూర్తిగా సానుకూలంగా స్పందిస్తానంటూ గతంలోనే మెగాస్టార్ చిరంజీవికి ఏపీ సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఇక, ఇప్పుడు ఈ ఆన్ లైన్ టిక్కెట్ల విధానం పైన సినీ పరిశ్రమ మొత్తం చిరంజీవి వైపు ఆశగా చూస్తోంది.

Recommended Video

    AP Economic Advisor గా Former SBI Chief Rajnish Kumar | AP CM Jagan || Oneindia Telugu
    జగన్ ను చిరంజీవి ఒప్పించగలరా

    జగన్ ను చిరంజీవి ఒప్పించగలరా

    చిరంజీవి నేరుగా సీఎంతో చర్చిస్తే ఫలితం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, టిక్కెట్ల విషయంలో ప్రేక్షకుల పైన భారం వేయకుండా..ఒకే విధానం అమల్లోకి తెచ్చేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఇది ఏపీలో కొత్త చర్చకు దారి తీస్తోంది. దీని పైన అటు సినీ పెద్దలు..ఇటు ప్రభుత్వం చర్చల ద్వారా ఏదైనా మధ్యే మార్గ నిర్ణయానికి వస్తారా..లేక, ఇదే నిర్ణయం అమలవుతుందా అనేది రానున్న రోజుల్లో క్లారిటీ రానుంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+