ప్రెండ్లీ పోలీస్.. కాల్ సెంటర్... ఠాణాలకు ర్యాంకులు
హైదరాబాద్: నగరంలో స్నేహపూర్వక పోలీసింగ్ మొదలైంది. భద్రత విషయంలో సిబ్బంది పనితీరు, ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు, స్టేషన్‌లో పని చేస్తున్న పని విధానం, పోలీసు సేవలతో ప్రజలు ఏ మేరకు సంతృప్తి చెందుతున్నారు. వంటి అంశాలపై కొత్వాల్ దృష్టి సారించారు. ఈ మేరకు పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో కొత్తగా సిటిజెన్ సాటిస్ఫక్షన్ ఫీడ్‌బ్యాక్ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించారు.

సిటిజెన్ సాటిస్ఫక్షన్ ఫీడ్‌బ్యాక్ సర్వీస్ ఏర్పాటు, ప్రయోజనాలపై పోలీసు కమిషనర్ ఎం. మహేందర్‌రెడ్డి సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. పోలీస్ ఠాణాలకు వెళ్లేవారి ఫోన్ నంబర్లను సేకరించి వారి సంతృప్తి స్ధాయిని తెలుసుకునేందుకు ఈ సమాచార కేంద్రం పనిచేయనుందని చెప్పారు. ఇందులో నిపుణులు, తెలివైన వారు విధులు నిర్వహిస్తున్నారని, రోజుకు 150 మందితో మాట్లాడుతున్నారని వివరించారు.
నగరంలో ఫ్రెండ్లీ కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రధానంగా విధివిధానాలపై కింద స్థాయి సిబ్బంది వరకు అవగాహన కల్పించడం, అదే విధంగా ప్రజలతో వ్యవహరించిన తీరుపై మార్పు కోసం కొన్ని కార్యక్రమాలు తీసుకున్నట్లు తెలిపారు. ఫ్రెండ్లీ పోలిసింగ్ విధానం అమలు కోసం ప్రధానంగా నాలుగు అంశాలపై దృష్టి కేంద్రీకరించినట్లు పోలీసు కమిషనర్ తెలిపారు. రిసెప్షన్, పిటీషన్, ఎఫ్‌ఐఆర్, పాస్‌పోర్టు వెరిఫికేషన్‌పై దృష్టి పెట్టామన్నారు.

కోర్టు, కోర్టు సిబ్బంది పనితీరు, దర్యాప్తు, పెట్రోలింగ్ సిబ్బంది పనితీరు, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ నేరాల నివారణ, కమిషనరేట్‌లోని సిబ్బంది పనితీరు, పలు రకాల పోలీసు సర్టీఫికెట్లు జారీ చేసే విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై దృష్టి పెడుతున్నామన్నారు. ప్రతి సమాచార కేంద్రం ద్వారా తాము సేకరించిన అనుభవాల ఆధారంగా పోలీస్ ఠాణాలకు ర్యాంకులను ఇవ్వనున్నామని చెప్పారు. వ్యక్తిగతంగా పదేపదే ఫిర్యాదులు వస్తే సదరు అధికారి, సిబ్బందిపై కఠినచర్యులు తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications