ఎన్టీఆర్ నటుడుగా అధికారంలోకి రాలేదు-ఇలా చేయటం వలనే : సినీ పరిశ్రమలోనూ- సీజేఐ ఎన్వీ రమణ..!!
మాతృభాష లేనిదే మనిషికి మనుగడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేసారు. తెలుగు భాషను కాపాడుకునేందుకు ఉద్యమస్థాయిలో భాషావేత్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వీధి అరుగు- దక్షిణాఫ్రికా తెలుగు సంఘం నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవ సదస్సులో ఆయన వర్చువల్ గా పాల్గొన్నారు. అమ్మభాషను మాట్లాడడం ఓ గౌరవంగా భావించాలని సీజేఐ సూచించారు. ఆంగ్లం మోజులో పడి తెలుగు భాషను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు.

ఎన్టీఆర్ అధికారంలోకి రావటానికి కారణమేంటంటే..
ఎన్టీ రామారావు అధికారంలోకి రావటం పైన సీజేఐ ఆసక్తి కర విశ్లేషణ చేసారు. ఆయన సినిమా నటుడు కావటంతో సులువుగా అధికారంలోకి వచ్చారని అభిప్రాయపడుతుంటారని.. అయితే, నాటి రాజకీయ పరిస్థితులు ఆయనకు ఖచ్చితంగా అనుకూలించాయని చెప్పారు. అందులో సందేహం లేదంటూనే..తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రం అందుకు కాస్త భిన్నంగా ఉందన్నారు. ఆయన ఊరూరా తిరిగి సరళమైన సామాన్యుడి భాషలో అద్భుతమైన ఉచ్ఛారణతో అనర్గళంగా ప్రసంగించి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తట్టిలేపిన ఆయన వాక్చాతుర్యం ఆయన విజయంలో కీలక పాత్ర పోషించిందని విశ్లేషించారు.

సినిమా రంగంలోనూ దయనీయంగా..
ఎందరో తారలను అందలమెక్కించిన సినిమా రంగంలో కూడా తెలుగు భాష పరిస్థితి దయనీయంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేసారు. తెలుగు సినిమా అర్ధం కావాలంటే ఇంగ్లీష్ లో సబ్ టైటిల్స్ చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. తెలుగు భాషకు గతంలో ఎన్నడూ లేనంతగా ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. భాషను కాపాడే బాధ్యత ప్రసార మాధ్యమాలపై కూడా ఉందన్నారు. తెలుగు మాధ్యమంలో చదవితే భవిష్యత్ ఉండదనే అపోహలు తొలగించాలని సూచించారు. డిగ్రీ వరకు తాను తెలుగు మాధ్యమంలోనే చదివానని చెప్పారు.

తెలుగులో విద్యా బోధన మేలు చేస్తుంది..
ఇంగ్లీషు అభ్యాసం ఎనిమిదో తరగతిలో మొదలైందని వివరించారు. ఉద్యోగ ధర్మం కనుక ఆంగ్లంలో అభ్యాసం, వాడకం కొనసాగిస్తున్నానని సీజేఐ చెప్పుకొచ్చారు. పల్లెటూరిలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో మాతృభాషలో చదువుకుని ఈరోజు నేను ఈ స్థాయికి చేరుకోగలిగానని చెప్పారు. పాఠ్య పుస్తకాలు, విద్యాబోధన వ్యవహారికంలో కొనసాగడం తన లాంటి వారికి ఎంతో ఉపయోగపడిందన్నారు.పోటీని తట్టుకోవాలంటే ఇతర భాషలను, ప్రధానంగా ఆంగ్ల భాషను విస్మరించలేమని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు.
అలా అని ఆంగ్లం కోసం తెలుగును త్యాగం చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం చేసారు. తనకంటే మెరుగైన వనరులున్నటువంటి ఈతరం వారు ఇంకెన్నో విజయాలను సాధించగలుగుతారన్నారు. ఆత్మ విశ్వాసం ముఖ్యమని..తెలివి తేటలకు తెలుగువాడిలో కొదవలేదని సీజేఐ ఎన్వీ రమణ పేర్కొన్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications