తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్ మనిషిగా ముద్ర - గర్విస్తున్నా : రిటైరయ్యాక పుస్తకం - సీజేఐ ఎన్వీ రమణ..!!

|
Google Oneindia TeluguNews

ఎన్టీఆర్ సహజ నటుడే కాకుండా సహజ నాయకుడు కూడానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చైతన్య రథంపై గ్రామగ్రామం తిరిగి జనంలో చైతన్యం తెచ్చారని, అధికారంలోకి వచ్చాక ప్రజలకు అపారమైన సేవ చేశారని కీర్తించారు. తాను లా చివరి సంవత్సరంలో ఉండగా ఎన్టీఆర్‌ టీడీపీని పెట్టినపుడు రోజూ వెళ్లి కలిసే వాడినని, ఆ తర్వాత న్యాయవాదిగా తన వంతు సహకారం అందించానని తెలిపారు.

అంతర్జాతీయ స్థాయిలో గౌరవం కోసం

అంతర్జాతీయ స్థాయిలో గౌరవం కోసం


సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని ఎన్టీఆర్‌ ఇచ్చిన నిర్వచనం కంటే ఉత్తమంగా, క్లుప్తంగా ప్రజాస్వామ్యాన్ని నిర్వచించడం మరెవరికీ సాధ్యం కాలేదన్నారు. తెలుగు భాష, సంస్కృతి, ఆత్మగౌరవం కోసం పోరాడిన ఎన్టీఆర్‌కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గౌరవం లభించేలా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత తెలుగు ప్రజలకు, వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని రాజకీయ పార్టీలకూ ఉందన్నారు. తెలుగు జాతికి ఎన్టీఆర్‌ తలమానికమన్నారు. ఆయనకు గౌరవం దక్కితే యావత్‌ తెలుగు జాతికి లభించినట్లేనని చెప్పారు. ఇందిరాగాంధీ మరణం తర్వాత కాంగ్రెస్‌ ప్రభంజనంలోనూ ఎన్టీఆర్‌ ఎక్కువ పార్లమెంట్‌ స్థానాలు సాధించినా తెదేపాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గుర్తు చేసారు.

అవార్డుల్లో చిన్న చూపు చూసారు

అవార్డుల్లో చిన్న చూపు చూసారు

ఆయనకు అవార్డుల విషయంలో చిన్న చూపు చూశారని, బాధాకరమని చెప్పారు. ఆయనకు ఇవ్వడం వల్ల అవార్డులకే విలువ పెరిగేదన్నారు. సినీ రంగంలోనూ ఆయనకు అవార్డులు ఇవ్వడంలో చిన్నచూపు చూశారన్నారు. తన బాధ్యతల విషయంలో రామారావు నాయకత్వ లక్షణాలు ప్రదర్శించారని, రాజకీయాల్లో ఎవరికీ అంతుబట్టని రీతిలో ప్రయోగాలు చేశారని, జనం నాడి తెలిసిన నేతగా ప్రజలతో మమేకమయ్యారని తెలిపారు. అలాంటి నేత మరొకరు లేరన్నారు. 1971లో తమ గ్రామానికి ఎన్టీఆర్‌ వస్తే ఫొటో దిగాలనుకున్నానని, కానీ మహాజన సంద్రంలో బతికి బట్టకడతానా అన్న భయం కలిగిందని గుర్తు చేసుకున్కనారు. ఎన్టీఆర్‌ మనిషిగా తనపై ముద్ర పడినందుకు గర్విస్తున్నానని వ్యాఖ్యానించారు.

నాన్నా అని పిలిచేవారు

నాన్నా అని పిలిచేవారు


వీలైతే రిటైరైన తర్వాత ఎన్టీఆర్‌ గురించి పుస్తకం రాస్తానని చెప్పారు. ఎన్టీఆర్‌ ఒకసారి తనను ఇంటికి రమ్మంటే వెళ్లానని చెబుతూ... రా నాన్నా అని పక్కన కూర్చోబెట్టుకున్నారంటూ నాటి అనుభూతిని గుర్తు చేసుకున్నారు. తానంటే ఎంతో అభిమానం చూపించేవారన్నారు. ఎవరూ లేనప్పుడు తనను నాన్నా అనేవారని చెప్పారు. ఆయనకు వ్యక్తిగతంగా, కుటుంబపరంగా అనేక న్యాయపరమైన విషయాల్లో సలహాలు ఇచ్చానిని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఎన్టీఆర్‌తో తనకున్న సాన్నిహిత్యాన్ని వివరించారు. భాష, సంస్కృతి, ఆత్మగౌరవం విషయంలో తమిళుల పోరాటం నుంచి నేర్చుకోవాలని సూచించారు.

English summary
CJI NV Ramana N.V. Ramana has hinted at plans to write autobiograph of late NTR post-retirement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X