CJI NV Ramana: రాజ్‌భవన్‌లో ఏపీ గవర్నర్‌తో కీలక భేటీ: మరోసారి వైఎస్ జగన్‌తో
విజయవాడ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. ప్రస్తుతం తన సొంత రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తోన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత ఆయన ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. స్వగ్రామంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరఫున ఇచ్చిన తేనీటి విందులో పాల్గొన్నారు.
ఇవ్వాళ సీజేఐ ఎన్వీ రమణ- గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సమావేశం కానున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో ఈ భేటీ ఏర్పాటు కానుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఎన్వీ రమణ తొలిసారిగా వచ్చినందున ఆయన గౌరవార్థం ఈ తేనీటి విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఇతర న్యాయమూర్తులు దీనికి హాజరవుతారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కొందరు మంత్రులు, అధికారులు ఈ విందులో పాల్గొంటారు.

విజయవాడ బార్ కౌన్సిల్ సభ్యులు సీజేఐని సన్మానించనున్నారు. అనంతరం బెజవాడ బార్ కౌన్సిల్ సభ్యుల సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆయన మూడు రోజుల పర్యటన ఈ సాయంత్రానికి ముగుస్తుంది. బార్ కౌన్సిల్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్తారని తెలుస్తోంది. తన మూడురోజుల పర్యటనలో భాగంగా సీజేఐ ఎన్వీ రమణ తీరిక లేకుండా గడిపారు. పలు సన్మాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కీలక ప్రసంగాలు చేశారు.
స్వగ్రామం పొన్నవరంలో ఎద్దులబండిపై కలియ తిరిగారు. అక్కడ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన తేనీటి విందుకు హాజరయ్యారు. విజయవాడ రోటరీ క్లబ్ ఏర్పాటు చేసిన పౌర సన్మానంలో పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి న్యాయాధికారులు సమావేశానికి హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నాని సహా పలువురు మంత్రులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications