శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బంతి కోసం పిడిగుద్దులు: క్రికెట్ వివాదంలో విద్యార్థి మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

శ్రీకాకుళం: ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఘోరం జరిగింది. శ్రీకాకుళం పట్టణంలో క్రికెట్ వివాదం కారణంగా ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బొందిలీపురం మెట్టవీధికి చెందిన పందొమ్మిదేళ్ల అజయ్ స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్నాడు.

స్థానికంగా ఉన్న ఓ తోటలో వారు శనివారం నాడు క్రికెట్ ఆడుతున్నారు. ఆ సమయంలో కిషోర్ అనే వ్యక్తితో బంతి కోసం ఘర్షణ చోటు చేసుకుంది. ఈ వివాదం ముదిరింది. ఘర్షణ చోటు చేసుకుంది. అజయ్ గుండె మీద కిషోర్ చేతితో బలంగా కొట్టాడు.

దీంతో, అజయ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికులు అతనిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అజయ్ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో ప్రాణాలు విడిచాడు. కిషోర్ పరారీలో ఉన్నాడు.

Clash in cricket match: one dies

అనంతలో 20వేల నకిలీ పట్టదారు పుస్తకాలు

అనంతపురం జిల్లాలో నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే నకిలీ పట్టదారు పాసు పుస్తకాల కుంభకోణంపై దర్యాఫ్తు జరుగుతోంది. ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడిని పోలీసులు ఇటీవలె అదుపులోకి తీసుకున్నారు. అనంతలో దాదాపు 20వేల నకిలీ పాసుపట్టాదారు పుస్తకాలు లభించినట్లుగా తెలుస్తోంది.

English summary
Clash in cricket match: one dies in Srikakulam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X