ముఖ్యమంత్రిగా డీకే, లైన్ క్లియర్- ప్రమాణ స్వీకార ముహూర్తం, కండీషన్స్ అప్లై..!!
కర్ణాటక కు కొత్త ముఖ్యమంత్రి ఖరారయ్యారు. కొంత కాలంగా సీఎం సీటు మార్పు విషయంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు వేళ చోటు చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఇప్పుడు డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పదవి అప్పగించేందుకు రంగం సిద్దమైంది. డీకే సీఎంగా ప్రమాణ స్వీకార ముహూర్తం ఖారరైంది. ఇదే సమయంలో సిద్దరామయ్య సహా.. సీనియర్లను బుజ్జగించేందుకు రంగంలో దిగిన ఏఐసీసీ నేతలు.. కొత్త కండీషన్లకు అంగీకారం తెలిపారు.
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఖాయమైంది. ప్రస్తుత సీఎం సిద్దరామయ్య రాజీనామాకు సిద్దం అయ్యారు. రేపు (గురువారం) ఏఐసీసీ నేతలు కేసీ వేణుగోపాల్, సూర్జేవాలా బెంగళూరు రానున్నారు. సిద్దరామయ్య.. డీకే శివకుమార్ తో సహా మిగిలిన సీనియర్లతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు.. సీనియర్లకు దక్కే ప్రాధాన్యత గురించి వారు స్పష్టత ఇవ్వనున్నారు. ఆ తరువాత సిద్దరామయ్య తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారు. ఈ నెల 29న కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసారు. పరిశీలకు సమక్షంలో డీకే శివకుమార్ ను తమ సీఎంగా ఖరారు చేయనున్నారు. అంతా అనుకున్నట్లుగా సవ్యంగా జరిగితే ఈ నెల 30న కర్ణాటక నూతన ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసేలా ఏఐసీసీ స్కెచ్ సిద్దం చేసింది.

ఎట్టకేలకు ఫలించిన నిరీక్షణ
డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి రాహుల్, ప్రియాంక సహా తమిళనాడు సీఎం విజయ్ సైతం హాజరు కానున్నారు. గతేడాది కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నప్పటి నుంచి నాయకత్వ మార్పుపై ఊహాగానాలు మొదలయ్యాయి. గత 18 నెలలుగా డీకే శివకుమార్ అనుచరులు ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారని చెబుతున్నారు. ఇదేసమయంలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు సీనియర్ కాంగ్రెస్ నేత జి. పరమేశ్వరకు సీఎంగా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో.. పార్టీ పరిశీలకులు సీనియర్లతో ఒన్ టు ఒన్ భేటీ నిర్వహించనున్నారు. పార్టీ నిర్ణయంగా డీకే శివకుమార్ కు సహకరించాలని స్పష్టం చేసే విధంగా కార్యాచరణ సిద్దమైంది. సిద్దరామయ్య గురువారం గవర్నర్‌ను సమయం కోరడంతో ఆయన రాజీనామాకు సిద్దపడినట్లు స్పష్టం అవుతోంది. అంతా సవ్యంగా జరిగితే ఈ నెల 30న నూతన సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.













Click it and Unblock the Notifications