రవితేజ 'ఇరుముడి' విడుదల తేదీ ఇదే..? ఈసారి కొడితే కుంభస్థలమే..!

మాస్ మహారాజ రవితేజ ఎలాంటి సీనీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అలా అంచలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా మారారు. కెరీర్ బిగినింగ్ లో కర్తవ్యం, సింధూరం, నిన్నే పెళ్లాడతా లాంటి చిత్రాల్లో చిన్న పాత్రలు చేసి.. ఆ తర్వాత 1999లో తొలిసారిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో నీకోసం సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమాలో నటించారు. 2002 లో వచ్చిన ఇడియట్ మూవీ రవితేజకు బిగ్ టర్నింగ్ పాయింట్. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి, వెంకీ, విక్రమార్కుడు, కిక్ సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలు సాధించి టాలీవుడ్ స్టార్ హీరోగా మారారు రవితేజ. రవన్న అంటే మినిమం గ్యారంటీ హిట్ అనే స్థాయికి చేరుకున్నారు. ఆ తర్వాత బలుపు, పవర్, రాజా ది గ్రేట్, క్రాక్, ధమాకా లాంటి విజయాలతో సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకెళ్లారు. కానీ ఇటీవలి కాలంలో రవితేజ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఆయన సినిమాలకు పెద్దగా కలెక్షన్స్ రావడం లేదు. ఇటీవల విడుదలైన భర్త మహాశయులకు విజ్ఞప్తి, మాస్ జాతర, మిస్టర్ బచ్చన్, ఈగల్ సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విఫలమైన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ సారి ఎలాగైనా బిగ్గెస్ట్ కమ్ బ్యాక్ ఇవ్వాలని రవితేజ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం రవితేజ శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఇరుముడి' అనే చిత్రం చేస్తున్నారు. ఈ మూవీతో మాస్ మహారాజ్ రవితేజ భారీ హిట్టు కొట్టడం గ్యారంటీ అని తెలుస్తోంది. కథా నేపథ్యం ఉన్న సినిమా అని గ్లింప్స్, పోస్టర్స్ చూస్తుంటే అర్థం అవుతోంది. అయితే ఈ మూవీ రిలీజ్ తేదీపై ప్రస్తుతం ఓ వార్త ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.

RaviTeja Irumudi Release Date Rumoured as August 14 Unconfirmed Report Creates Huge Buzz RaviTeja

ఇరుముడి మూవీని ఈ ఏడాది ఆగస్టు మొదటివారం లేదా రెండోవారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఆగస్టు 14న విడుదల అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇక ఆగస్టు 24న నేచురల్ స్టార్ నాని ప్యారడైజ్ మూవీ భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 14 అయితేనే బెటర్ అని చిత్ర నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+