Prof. Nageswar: ఏపీ సర్కార్ కేసులపై ప్రొఫెసర్ నాగేశ్వర్ ఫైర్..! కీలక ప్రశ్నలు..!
ఓ టీవీ చర్చలో తాను చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నమోదు చేసిన కేసులపై రాజకీయ విశ్లేషకుడు, ప్రొఫెసర్ నాగేశ్వర్ (Prof. Nageswar) మండిపడ్డారు. తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పినా, ప్రభుత్వం మాత్రం కక్షసాధింపు ధోరణితో కేసులు నమోదు చేయడం, అందులోనూ కుల, మత గొడవల్ని రెచ్చగొట్టారంటూ కేసులు పెట్టడంపై నాగేశ్వర్ మండిపడ్డారు. ఇవాళ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ఓ సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వమే తనపై నేరుగా కేసులు పెట్టిందని నాగేశ్వర్ తెలిపారు. కుల చిచ్చు పెట్టానని తనపై కేసు పెట్టారని, అసలు తన వ్యాఖ్యల్లో కుల ప్రస్తావన ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు. తాను చేయకపోయినా ప్రాంతాల ప్రస్తావన చేశారని కేసు పెట్టారని, అసలు ప్రాంతాల ప్రస్తావన చేసింది ఆ రెండు పార్టీల వారే అన్నారు. నువ్వు తెలంగాణ వాడివి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారన్నారు. తాను అమెరికా, ఇరాన్ గురించి మాట్లాడితే అక్కడి పౌరుడిని కావాలా అని ప్రశ్నించారు.

అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించారని తనపై మరో కేసు కూడా పెట్టారని నాగేశ్వర్ తెలిపారు. తాను రెండు దోమల్ని కూడా చంపలేదన్నారు. ఆ సెక్షన్లు చూస్తే .. నా వ్యాఖ్యలకు ఇవి వర్తిస్తాయని చెప్పారన్నారు. తాను మాట్లాడిన విషయాలు అసలు సమస్యే కాదన్నారు. కుల, ప్రాంతాల ప్రస్తావన కూడా తాను చేయలేదన్నారు. అణగారిన వర్గాలు, జాతుల కోసమే తాను ఇప్పటివరకూ మాట్లాడానన్నారు. వెనెజులా, క్యూబా, కొలంబియా గురించి తాను గతంలో మాట్లాడానన్నారు. ఇక్కడా అదే విధంగా మాట్లాడితే కేసులు పెట్టడం సరికాదని నాగేశ్వర్ తెలిపారు.














Click it and Unblock the Notifications