టీడీపీ, వైసీపీ ఘర్షణ: బైఠాయించిన ఎంపీ కేశినేని, జగ్గయ్యపేటలో ఎన్నిక వాయిదా

Subscribe to Oneindia Telugu

కృష్ణా: జగ్గయ్యపేట మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఘర్షణకు దారితీసింది. తమ కౌన్సిలర్లను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అపహరించారంటూ పురపాలిక సమావేశ మందిరంలో టీడీపీ ఆందోళన చేపట్టింది.

  Pamphlets Hulchul in West Godavari Over TDP leaders Corruptions టీడీపీలో 'కరపత్రం' అలజడి| Oneindia

  కిడ్నాప్‌ అయిన ఇద్దరు సభ్యులను తీసుకువచ్చేంత వరకు ఎన్నిక జరనగనివ్వమంటూ టీడీపీ నేతలు, సభ్యులు నినాదాలు చేశారు. పోడియం ఎదుట ఎంపీ కేశినేని నాని, టీడీపీ కౌన్సిలర్లు బైఠాయించారు.

  Clashes between tdp, ysr congress in Jaggaiah municipal chairman elections

  అంతేగాక, ఎన్నికల అధికారి మైక్‌ను టీడీపీ కౌన్సిలర్లు లాగేశారు. దీంతో టీడీపీకి వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు నినాదాలు చేశారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల నిర్వాహణపై అధికారులు సందిగ్ధంలో పడ్డారు.

  ఛైర్మన్‌ ఎన్నికను అరగంటపాటు వాయిదా వేశారు. అయితే, టీడీపీ నేతలు మాత్రం ఎన్నికను వాయిదా వేయాలంటూ డిమాండ్ చేశారు. అదే సమయంలో మున్సిపల్‌ కార్యాలయం వద్ద దుండగులు ద్విచక్రవాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

  ఎన్నిక వాయిదా

  జగ్గయ్యపేట మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక వాయిదా పడింది. ఛైర్మన్‌ ఎన్నిక సందర్భంగా చోటుచేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్నికను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి హరీష్‌ తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు మళ్లీ ఎన్నిక నిర్వహించనున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Clashes occurred between tdp, ysr congress when Jaggaiahpet municipality chairman elections are in process.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి