లారీ దగ్ధం, క్లీనర్ సజీవ దహనం
పశ్చిమగోదావరి జిల్లాలో ప్రొక్లయినర్ లోడ్ తో వెళుతున్న లారీ కరెంట్ తీగలు తగిలి తగులబడిపోయిన ప్రమాదంలో క్లీనర్ సజీవ దహనమయ్యాడు.
పశ్చిమగోదావరి: నిడమర్రు మండలం గుణపర్రు సమీపంలో ఒక ప్రొక్లెయిన్ ను తీసుకువెళుతున్న లారీకి కరెంట్ తీగలు తగలడంతో మంటలు చెలరేగి లారీ తగులబడిపోయింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ సజీవ దహనమయ్యాడు . విద్యుత్ సరఫరా ఉన్నకరెంట్ తీగలు తగిలి లారీలో మంటలు రేగడంతో క్లీనర్ అజయ్ ఆ తీగలను తప్పించేందుకు ప్రయత్నించాడు.
దీంతో కరెంట్ షాక్ తగిలి లారీలో కుప్పకూలిపోయాడు. అయితే . లారీ డ్రైవర్, ప్రొక్లెయిన్ మిషన్ ఆపరేటర్‌లు షాక్ కు గురైన క్లీనర్ అజయ్‌ను రక్షించడం మానేసి ప్రొక్లైయిన్‌ను కిందకి దింపడంపైనే దృష్టి సారించేసరికి ఈ లోపు క్లీనర్ అజయ్ శరీరం కాలి బూడిదైంది.

క్లీనర్ అజయ్ సొంత ఊరు ఏలూరుగా తెలిసింది. లారీ డ్రైవర్, ప్రొక్లెయిన్ మిషన్ ఆపరేటర్‌లు సకాలంలో స్పందించి ఉంటే క్లీనర్ ప్రాణాలతో బైటపడే అవకాశం ఉందని ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు.












Click it and Unblock the Notifications