అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాం - చంద్రబాబు..!!
వైసీపీ లక్ష్యంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. అప్పులతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తే దీర్ఘకాలం కొనసాగదన్న సీఎం, తాను సూపర్ సిక్స్ అంటే సాధ్యం కాదన్నారని, చేసి చూపించామని తెలిపారు. అన్నదాత సుఖీభవ కింద రైతులకు ఎప్పటికప్పుడు జమ చేస్తున్నామని పేర్కొన్నారు. ఉచిత బస్సుతో మహిళలు చాలా ఆనందంగా ఉన్నారన్నారు.
అమరావతి మునిగిందని ప్రచారం చేస్తున్న పార్టీనే మునిగిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసారు.
కాకినాడ జిల్లా పెద్దాపురంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. సంపద సృష్టించడం, ఆదాయాన్ని పెంచడం తమకు తెలుసని చెప్పారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అరాచకాన్ని సృష్టించారని, సంక్షేమం, అభివృద్ధి రెండు కార్యక్రమాలూ చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతిఒక్కరి ఆదాయం పెరిగి ఆరోగ్యంగా ఉండాలనేదే తన ఏకైక కోరిక అని తెలిపారు. మన ఆలోచనలు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలన్న సీఎం, చెత్త నుంచి సంపద ఎలా సృష్టించాలో ఆలోచిస్తున్నామన్నారు. ఈ వేస్ట్‌ను రీసైక్లింగ్‌కు పంపేలా ఆలోచనలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రజారోగ్యాన్ని గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. పేదవాడి ఆరోగ్యం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని, పెద్దాపురంలో వంద పడకల ఆస్పత్రికి హామీ ఇస్తున్నామని చెప్పారు.

ఎవరిని అడిగినా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటున్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని, అనేకమంది పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు. పోలవరాన్ని పూర్తి చేసి 2027లో జాతికి అంకితం చేస్తామని, రాజధాని అమరావతి రూపురేఖలు మారుస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. కేంద్రం అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకువస్తోందని, ఒక్కో ఇటుక పేరుస్తూ, ఒక్కో మెట్టు ఎక్కుతున్నామని తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేట్‌పరం కాకుండా చూశామన్న సీఎం, విశాఖకు రైల్వే జోన్ వస్తోందన్నారు. రాష్ట్రం కోసం కూడా పదితరాల ముందుకు ఆలోచించాలని అభిప్రాయపడ్డారు. పదిసార్లు ఆలోచించి ఓటు వేయాలని, అప్పుడే రాష్ట్ర ప్రగతి సాధ్యమవుతుందని చంద్రబాబు సూచించారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications