ఆ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు తప్పదు, ముహూర్తం ఫిక్స్..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు కఠిన నిర్ణయాలకు సిద్దం అవుతున్నారు. పార్టీ - ప్రభుత్వంలో కఠినం గానే వ్యవహరించాలని డిసైడ్ అయ్యారు. ఈ రోజు నుంచి జరిగే కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వ లక్ష్యా లను స్పష్టం చేయనున్నారు. అదే విధంగా కొందరి ఎమ్మెల్యేల వ్యవహార శైలి పైన చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. వారిని పిలిచి మాట్లాడగా.. కొందరిలో మార్పు వచ్చినట్లు గుర్తించారు. కాగా.. మార్పు రాని వారి పైన వేటు తప్పదని తేల్చి చెప్పారు. ఇందుకు ముహూర్తం ఖరారు చేసారు.

ఎన్ని సార్లు హెచ్చరించినా.. తీరు మారని ఎమ్మెల్యేల పై వేటు తప్పదని చంద్రబాబు తేల్చి చెప్పారు. కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి మారాల్సి ఉన్నదని, వారికి త్వరలోనే తుది హెచ్చరిక చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంత్రులు లోకేశ్‌, అనగాని సత్య ప్రసాద్‌, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, పయ్యావుల కేశవ్‌తో సీఎం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతోపాటు పార్టీ క్యాడర్‌లో నెలకొన్న అసంతృప్తిని తొలగించే చర్యలు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

cm-chandra-babu-chances-to-take-serious-four-mlas-before-local-body-elections-here-the-details

ఆరు నెలల క్రితం రాష్ట్రంలో 40 మంది ఎమ్మెల్యేల పనితీరుపై తాను అసంతృప్తితో ఉన్నానని, తాను వారిని పిలిచి హెచ్చరించడంతో 15 మంది దారికొచ్చారని, మిగిలిన వారు వ్యవహరిస్తున్న తీరుపై తన వద్ద నివేదికలు ఉన్నాయని వెల్లడించారు. త్వరలో నలుగురైదుగురిపై వేటు తప్పదని సీఎం తేల్చి చెప్పారు. అలాంటి వారిని పిలిచి ఫైనల్‌గా మాట్లాడతానని, పద్ధతి మార్చుకోకపోతే మాత్రం తనతో వారికి అదే చివరి సమావేశం అవుతుందన్నారు.

స్థానిక ఎన్నికల వేళ కీలక నిర్ణయాలు

అదే విధంగా రాబోయే స్థానిక సంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లోపే కఠిన నిర్ణయాలు ఉంటాయని, పనిచేయని వారి స్థానంలో వేరే నాయకులు పనిచేస్తారని తెలిపారు. ఈసారి పార్టీ గెలుపు ముఖ్యం అని స్పష్టం చేసారు. వ్యక్తుల కోసం పార్టీని బలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అవసరమైతే కొంత మందిని వదులుకొని ముందుకు వెళ్లిపోతామన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని అసెంబ్లీ వేదికగా తిప్పికొట్టగలిగామని, ఏకసభ్య కమిషన్‌ నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయని సీఎం వ్యాఖ్యానించారు.

మండలిలో తిరుమల నెయ్యి కల్తీపై వైసీపీ సభ్యులు మాట్లాడకుండా ఇందాపూర్‌పై మాట్లాడి అసలు విషయాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారని చెప్పుకొచ్చారు. జగన్‌ అక్రమాస్తుల కేసులు కూడా త్వరలోనే విచారణకు వచ్చే అవకాశం ఉందని, డిశ్చార్జి పిటిషన్లు వేసి విచారణలో జాప్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే ఈ పిటిషన్లను హైకోర్టు, సుప్రీంకోర్టులు కొట్టివేస్తున్నా యని మంత్రులు వ్యాఖ్యానించారు. ఈ కేసుల విచారణ ప్రారంభమైతే జగన్‌ ప్రతి రోజూ కోర్టుకు వెళ్లాల్సి వస్తుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+