అమరావతిపై చంద్రబాబు కొత్త వ్యూహం - ఢిల్లీ సంకేతాలు..!!
ఏపీ కొత్త అసెంబ్లీ కొలువు తీరింది. మూడు పార్టీల ప్రభుత్వ పాలన మొదలైంది. పాలనా పరంగా చంద్రబాబు వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. అనూహ్య మెజార్టీతో పట్టం కట్టిన ప్రజలకు పాలన పైన భారీ అంచనాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది రాజధాని అమరావతి. కానీ, అమరావతిలో తిరిగి రాజధాని పనుల ప్రారంభానికి అనేక సమస్యలు తెర మీదకు వస్తున్నాయి. మరి..చంద్రబాబు వ్యూహం ఏంటి. ఏం చేయబోతున్నారు.
అమరావతిపై అడుగులు
ఏపీ కొత్త ప్రభుత్వ సమర్దతకు రాజధాని సవాల్ గా నిలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు మరో నాలుగు సీజన్ల వరకు నిర్మాణం పూర్తి చేయలేమని చంద్రబాబుకు అధికారులు తేల్చి చెప్పారు.ఇక అమరావతి విషయంలో ఏం చేయబోతున్నారనేది కీలకంగా మారుతోంది. రాజధాని లేని రాష్ట్రంగా ప్రచారం జరగటాన్ని జీర్ణించుకోలేకపోయిన ప్రజలు ఏకపక్షంగా కూటమికి మద్దతు ఇవ్వటంలో కీలక అంశం. ఇప్పుడు చంద్రబాబు అమరావతిలో పర్యటించారు. అధికారులతో సమీక్షించారు. అనేక సమస్యలు అమరావతిలో నిర్మాణాల ముందు కనిపిస్తున్నాయి. అమరావతి మొత్తం మూడు దశల్లో నిర్మాణం చేయాల్సి ఉంది.

పరిష్కారం పై ఫోకస్
రాజధాని మొత్తం నిర్మాణం వ్యయం అంచనా లక్ష కోట్లు. తొలి విడత నిర్మాణం కోసం రూ 38 వేల కోట్లు అవసరం అవుతాయని మంత్రి నారాయణ వెల్లడించారు. మొదటి దశ నిర్మాణం పూర్తయితే రాజధానిలో స్థలాల విక్రయం ద్వారా నిధుల సమీకరణ సాధ్యం అవుతుందని భావిస్తున్నారు. అయితే, నిర్మాణాల ప్రారంభానికి ముందు న్యాయ పరమైన అంశాలను పరిష్కరించుకోవాల్సి ఉంది. గతంలో హైకోర్టు అమరావతి రాజధానిగా కొనసాగించాలంటూ ఇచ్చిన తీర్పు పైన సుప్రీంకోర్టులో నాటి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ విచారణలో ఉంది. ఆ కేసు ఉపసంహరించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.
కొత్త వ్యూహంతో ముందుకు
ఇక, 2014-19 కాలంలో రాజధాని కోసం ఖరారు చేసిన మాస్టర్ ప్లాన్ తోనే ముందుకు వెళ్లాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. అయితే, టెండర్లను మాత్రం కొత్తగా పిలవాల్సి ఉంటుంది. దీనికి ముందు ఆర్దికంగానూ వెసులుబాటు చూసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రాజధానిలో పేదలకు ఇంటి స్థలాలను గత ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇప్పుడు ఆ స్థలాల అంశం కోర్టు పరిధిలో ఉంది. వీటిని పరిష్కరించకుంటూ రాజధాని నిర్మాణం పైన అడుగులు వేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అమరావతి నిర్మాణం పైన కేంద్రం సాయం పైన సానుకూల సంకేతాలు వస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నగరమే కూటమి రాజకీయ భవిష్యత్ ను నిర్ణయించేదిగా కనిపిస్తోంది. దీంతో..ఇప్పుడు చంద్రబాబు నిర్ణయాల పైన ఆసక్తి కొనసాగుతోంది.
-
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications