Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బ్రాండ్ ఏపీ - చంద్రబాబుకు బిగ్ టాస్క్..!!

దావోస్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు చంద్రబాబు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నెల 20 నుంచి ఐదురోజుల పాటు దావోస్‌లో జరిగే సమావేశాల్లో పాల్గొంటారు. ఈ పర్యటనలో చంద్రబాబు టీం ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థల ప్రతినిధులతో భేటీ కానున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో పాటుగా
రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యం గా ఈ పర్యటన సాగనుంది. ఇప్పటికే ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు ఈ అవకాశాన్ని చంద్రబాబు సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు.

పెట్టుబడులే లక్ష్యంగా
ముఖ్యమంత్రి చంద్రబాబు టీం ఈ రాత్రి దావోస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ అర్ద్రరాత్రి ఢిల్లీ నుంచి ఈ టీం బయల్దేరుతోంది. ఏపీకి భారీ స్థాయిలో పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా మూడు రోజులు వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. దావోస్‌ ఆర్థిక సదస్సులో ఏపీ పెవిలి యన్‌ కొలువు తీరుతోంది. ఈ మూడు రోజుల్లో చంద్రబాబు కనీసం 30 మంది ప్రముఖ సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యేలా షెడ్యూల్ ఖరారైంది. మూడు రోజుల సమావేశాల్లో భాగంగా తొలి రోజున చంద్రబాబు స్విట్జర్లాండ్‌లోని భారత రాయబారితో సమావేశమవుతారు. ఆ తర్వాత హిల్టన్‌ హోటల్‌లో పది మంది పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతారు.

CM Chandra Babu leave for the WEF meeting in Switzerland s Davos where he will promote Brand AP

వరుస భేటీలు
ఇక, ప్రత్యేకంగా స్విట్జర్లాండ్‌లోని ప్రవాసాంధ్రులతో 'మీట్‌ అండ్‌ గ్రీట్‌'తో ఆత్మీయ సమావేశం లో పాల్గొంటారు. ఆ తరువాత పలువురు పారిశ్రామిక, వాణిజ్యవేత్తలతో డిన్నర్‌లో పాల్గొంటారు. రెండో రోజు ఇలా... దావోస్‌లో రెండో రోజున సీఐఐ సెషన్‌లో గ్రీన్‌ హైడ్రోజన్‌ అంశంపై జరిగే చర్చలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. తర్వాత సోలార్‌ ఇంపల్స్‌ కోకొకోలా, వెల్‌స్పన్‌, ఎల్‌జీ , క్లార్స్‌ బర్గ్‌, సిస్కో, వాల్‌ మార్ట్‌ ఇంటర్నేషనల్‌, కాగ్నిజెంట్‌ టెక్నాలజీస్‌ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతారు. యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్‌తో చర్చలు జరుపుతారు. అనంతరం వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ నిర్వహించే ఎనర్జీ ట్రాన్స్‌మిషన్‌ వేర్‌ పబ్లిక్‌ పాలసీ మీట్స్‌ ప్రైవేట్‌ గోల్స్‌ అనే అంశంపై చర్చలో చంద్రబాబు పాల్గొంటారు.

బ్రాండ్ ఏపీ
దావోస్ వేదికగా సీఎం చంద్రబాబు పలు జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధుల తో సమావేశం లో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పారిశ్రామిక అనుకూల విధానాల ను వివరిస్తారు. ఇక, మూడో రోజు దిగ్గజ సంస్థల అధినేతలతో చంద్రబాబు సమావేశమవుతారు. నాలుగోరోజు ఉదయం దావోస్‌ నుంచి జ్యూరిచ్‌కు చేరుకుని అక్కడి నుంచి స్వదేశానికి చేరుకుంటారు. 2014 -19 మధ్య కాలంలో సీఎంగా ఉన్న సమయంలోనూ చంద్రబాబు వరుసగా దావోస్ పర్యటనకు వెళ్లేవారు. తిరిగి ఇప్పుడు సీఎం అయిన తరువాత దావోస్ పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు బృందంలో మంత్రులు లోకేష్, టీజీ భరత్ తో పాటుగా పరిశ్రమల శాఖ, ఈడీబీ అధికారులు ఉన్నారు. ఈ పర్యటన వేళ ఏపీతో జరిగే ఒప్పందాల పైన ఆసక్తి నెలకొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+