కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ, కీలక ప్రతిపాదనలు..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల పై చర్చించారు. కీలక ప్రతిపాదనలు చేసారు. కేంద్రం నుంచి సహకారం కావాలని కోరారు. ఏపీకి కేంద్రం నుంచి వివిధ పథకాల కింద నిధులు మంజూరు చేయాలని చంద్రబాబు అభ్యర్ధన చేసారు. అదే విధంగా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు.. ఏపీ ప్రతిపాదనల పైన వివరించారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన అంశాల పైన సీఎం సుదీర్ఘంగా చర్చలు చేసారు.

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమైన చంద్రబాబు బృందం పూర్వోదయ, సాస్కీ పథకాల ద్వారా నిధులు అందించి ఏపీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని, పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మూడు వర్కింగ్ ఉమెన్ హాస్టళ్ల నిర్మాణాల పూర్తికి నిధులివ్వాలన్నారు.

CM Chandra Babu meets Nirmala Sitaraman and seek Central support for various projects

సాస్కీ కింద రెండో విడత రూ.10,054 కోట్ల నిధులు మంజూరు చేయాలని, మౌలిక సదుపాయాల నిర్మాణానికి నిధులు కీలకమని చెప్పారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు రూ.41 వేల కోట్ల ఆర్థిక సహకారం అవసరమని, కేంద్ర బడ్జెట్‌లో రాయలసీమ హార్టికల్చర్ డెవలప్‌మెంట్‌ ప్యాకేజీ ప్రకటించాలని ప్రతిపాదించారు.

అదే విధంగా పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టును 3 దశలుగా చేపట్టేందుకు అయ్యే వ్యయాన్ని వివరిస్తూ ఆర్థికమంత్రికి సీఎం లేఖ అందించారు. ప్రాజెక్టును చేపట్టేందుకు ఇప్పటికే జలహారతి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రాథమిక ప్రాజెక్టు రిపోర్టును కూడా కేంద్ర జలశక్తి శాఖకు సమర్పించినట్లు తెలిపారు. కేంద్ర జలశక్తి మంత్రితో చర్చలో భాగంగా ఆయన పోలవరం సహా రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు, వివిధ పథకాలకు నిధుల విడుదల గురించి మాట్లాడారు.

CM Chandra Babu meets Nirmala Sitaraman and seek Central support for various projects

ప్రత్యేకించి విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని, పెండింగ్ అంశాలపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని కోరారు. రాష్ట్రంలో సాగు, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+