'రాజధాని నుంచి పాలన ఇలా': మాట్లాడుతుంటే బావలు సయ్యా పాట, బాబు అసహనం!

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: రాజధాని అమరావతి నుంచి పాలన ఎలా నిర్వహిస్తామో, అన్ని విషయాలను గవర్నర్ నరసింహన్‌కు చెప్పానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. ప్రతి బ్లాక్ గురించి ఆయనకు వివరించానని, ఏయే బ్లాక్‌లో ఏ కార్యాలయాలు ఉండబోతున్నాయో చెప్పానన్నారు.

ఏపీలో మెరుగైన పాలన కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. అన్ని సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ రోజు వెలగపూడిలో తాత్కాలిక సచివాలయాన్ని పరిశీలించారు. తాత్కాలిక సచివాలయం ఐదో భవనం వద్ద గవర్నర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు.

CM Chandrababu briefs to Governor about AP capital

చంద్రబాబు మాట్లాడుతుంటే..

వెలగపూడి సచివాలయం వద్ద చంద్రబాబు మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో మైకులో నుంచి బావలు సయ్యా.. అనే పాట పెద్దగా వినిపిస్తుండటం ఆయనకు అసహనాన్ని కలిగించినట్లుగా తెలుస్తోంది. గవర్నర్ నరసింహన్‌తో కలసి వెలగపూడికి వచ్చిన ఆయన, భవనాల నిర్మాణాలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు.

గవర్నర్ రాకను దృష్టిలో ఉంచుకుని, వేద పండితులను, మేళతాళాలను, మైక్ సెట్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. ఆ పాట ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. కానీ బాబు ప్రసంగానికి అడ్డు తగులుతున్న పాటలను ఆపాలని అధికారులు పదే పదే కోరాల్సి వచ్చింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh CM Chandrababu briefs to Governor Narasimhan about AP capital Amaravati.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి