కార్యకర్తలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన సీఎం చంద్రబాబు
ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడి ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి. ఏకంగా 164 సీట్లలలో విజయం సాధించి కూటమి చరిత్ర సృష్టించింది. కూటమి విజయం సాధించడంతో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు రాష్ట్రాభివృద్ది కోసం పాటుపడుతున్నారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఒకపక్క పాలనతో ప్రజలకు అందుబాటులోనే ఉంటునే మరోపక్క పార్టీ క్యాడర్‌కి దూరం కాకూడదని చంద్రబాబు భావిస్తున్నారు. ఇంతటి గొప్ప విజయానికి కార్యకర్తలే కారణమని గుర్తించిన సీఎం చంద్రబాబు వారికి అందుబాటులో ఉండాలని నిర్ణయించుకున్నారు.

ఇకనుంచి ప్రతి శనివారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు.సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నారు. మంత్రి నారా లోకేష్ సైతం పార్టీ క్యాడర్‌కు అందుబాటులో ఉంటారని చంద్రబాబు సూచించారు. కార్యకర్తలకు ఏ సమస్య వచ్చిన వెంటనే ఆదుకునేలా ఓ ప్రణాళిక రూపొందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీని కోసం ఓ టీంను కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications