గుడ్ న్యూస్ చెబుతున్న సీఎం చంద్రబాబు, సొంత నియోజక వర్గంలో సంబరాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గం కుప్పంలో అభివృద్ధి పనులు ఊపందుకోవడానికి ఆ నియోజక వర్గం టీడీపీ నాయకులు ఒక ప్రణాళిక రూపొందిస్తున్నారని తెలిసింది. ఇప్పటికే కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చలు జరిపారు.

కుప్పం నియోజకవర్గంలోని ప్రతి మండలంలో పరిశ్రమల ఏర్పాటు చేయడానికి భూసేకరణ విషయంలో టీడీపీ నాయకులు రంగంలోకి దిగారు. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు, డీకేటీ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయని సర్వే చేసిన టీడీపీ నాయకులు నివేదిక సిద్ధం చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో అధిక సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు డిసైడ్ అయ్యారు.

CM Chandrababu decided to set up large-scale industries in Kuppam

మహిళల కోసం టెక్స్ టైల్స్ పార్క్ లు కూడా ఏర్పాటు చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు తగిన చర్యలు తీసుకుంటున్నారని కుప్పం నియోజకవర్గం టీడీపీ నాయకులు అంటున్నారు. కుప్పం నియోజకవర్గంలోని ప్రజలు ఉపాధి కోసం ప్రతిరోజు రైలులో బెంగళూరు వెళ్లి పని చేస్తూ రాత్రి తిరిగి కుప్పం చేరుకుంటున్నారు. బెంగళూరు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్న చాలామందికి కుప్పం నియోజకవర్గంలోనే ఉపాధి కల్పించడానికి టీడీపీ తగిన చర్యలు తీసుకుంటున్నదని తెలిసింది.

పరిశ్రమల ఏర్పాటు విషయంలో సంబంధిత అధికారులు కలిసికట్టుగా పనిచేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలోని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం లోని అన్ని మండలాల్లో ప్రభుత్వ భూముల వివరాల సేకరించిన అధికారులు సీఎం చంద్రబాబు నాయుడుకు సమాచారం ఇచ్చారని తెలిసింది.

CM Chandrababu decided to set up large-scale industries in Kuppam

కుప్పంతో పాటు చిత్తూరు జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజక వర్గాల్లో కూడా పరిశ్రమల ఏర్పాటు చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపారు. చిత్తూరు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిశ్రమలు, పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయడానికి భూసేకరణ కోసం అధికారులు రంగంలోకి దిగారు.

మొత్తం మీద కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలకి సీఎం చంద్రబాబు నాయుడు త్వరలో గుడ్ న్యూస్ చెబుతారని తెలిసింది. కుప్పం నియోజకవర్గంలో పరిశ్రమలతో పాటు యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడానికి సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని, త్వరలోనే కుప్పంకు భారీ ఎత్తున నిధులు మంజూరు అవుతాయని ఆ నియోజకవర్గం టీడీపీ నాయకులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+