మాట ఇచ్చా, భారమైనా అమలు చేస్తా - చంద్రబాబు లేఖ..!!

ఏపీలో పెరిగిన పెన్షన్ల పంపిణీకి రంగం సిద్దమైంది. అధికారంలోకి వస్తే రూ 3 వేల నుంచి రూ 4 వేలకు పెన్షన్ పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా బాధ్యతల స్వీకరణ సమయంలోనే సంతకం చేసారు. జూలై 1న ఏప్రిల్ నుంచి పెరిగిన పెన్షన్ అమలు చేస్తూ ఒక్కో లబ్దిదారుకి రూ 7వేలు పంపిణీకి నిర్ణయించారు. ఇంటి వద్దే పంపిణీ చేసేలా మార్గదర్శకాలు జారీ చేసారు. ఈ సమయంలోనే లబ్ది దారులకు చంద్రబాబు లేఖ రాసారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్ దారులకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. 'కు అండగా నిలుస్తూ, సంక్షేమం చూసే ప్రజా ప్రభుత్వం ఏర్పాటైందిని వివరించారు. మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ ను ఒకేసారి రూ.వెయ్యి పెంచి ఇస్తున్నాంమన్నారు. దివ్యాంగులకు పింఛన్ రూ.6 వేలు ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. జులై 1 నుంచే పెంచిన పింఛన్లు ఇంటి వద్దే అందిస్తామని స్పష్టం చేసారు.

CM ChandraBabu Explains the pensions hike decisions in his letter to beneficiaries

ఆర్థిక సమస్యలున్నా.. ప్రజా సంక్షేమం కోసం తొలి రోజు నుంచే నిర్ణయాలు తీసుకుంటున్నామని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. పింఛన్ల పెంపు వల్ల ప్రభుత్వంపై నెలకు అదనంగా రూ.819 కోట్ల భారం పడనుందని వివరించారు.

నాటి అధికార పక్షం మిమ్మల్ని పింఛన్ విషయంలో ఎంతో క్షోభ పెట్టిందన్నారు. ఎన్నికల సమయంలో 3 నెలలు వారి కష్టాలు చూసి చలించిపోయానని వివరించారు. మండుటెండలో, వడగాడ్పుల మధ్య పడిన అగచాట్లు చూశానన్నారు. ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపును వర్తింపజేస్తానని మాట ఇచ్చానని... ఏప్రిల్, మే, జూన్ నెలలకూ పెంపును వర్తింపచేసి మీకు అందిస్తున్నామని లేఖలో సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+