జగన్ పల్నాడు వెళ్తే బాబుకు భయం అదే!
గతేడాది సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఆత్మహత్యకు పాల్పడిన వైఎస్ఆర్సిపి నేత రెంటపాళ్ళ గ్రామ ఉపసర్పంచ్ నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్న వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను కూటమి ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని వైసిపి నేతలు మండిపడుతున్నారు వైఎస్ఆర్సిపి నేత మాజీ మంత్రి శైలజనాథ్.
జగన్ సత్తెనపల్లి వెళితే చంద్రబాబు సర్కారుకు ఇబ్బంది ఏంటి?
నేడు మీడియాతో మాట్లాడుతూ వైయస్ జగన్ సత్తెనపల్లి వెళితే చంద్రబాబు సర్కారుకు ఉన్న ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించే హక్కు కూడా జగన్ కు లేదా అని నిలదీశారు. జగన్ కు ఉన్న ప్రజాభిమానాన్ని చూసి ఓర్వలేక అడుగు అడుగున ఆంక్షలు విధిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. స్వచ్ఛందంగా తరలి వచ్చే ప్రజలను నియంత్రించ వలసిన బాధ్యత ప్రభుత్వానిదని ఆయన పేర్కొన్నారు.

ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ
పొదిలిలో వైయస్ జగన్ కు వచ్చిన జనస్పందన చూసి టిడిపి ప్రభుత్వం భయపడుతుందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందని మాజీ మంత్రి శైలజానాథ్ పేర్కొన్నారు. చంద్రబాబు సర్కారు బ్రిటిష్ చట్టాలను అమలు చేస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అడుగడుగునా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అణచివేయాలని చూస్తోందన్నారు.
పోలీసుల బెదిరింపులు దారుణం
30 యాక్ట్ పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పర్యటనలను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని మాజీ మంత్రి శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు శాంతియుత నిరసనలు, సమావేశాలకు భారత రాజ్యాంగం అనుమతి ఇచ్చిందని పేర్కొన్న మాజీ మంత్రి శైలజానాథ్, దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేసులు పెడతాం పెట్టిస్తాం అంటూ పోలీసులు బెదిరింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
బాబు సర్కార్ కు జగన్ పల్నాడు వెళ్తే భయం దేనికో
అసలు వైయస్ జగన్ పల్నాడుకు వెళితే బాబు సర్కార్ ఎందుకు భయ పడుతుందో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు మాజీ మంత్రి శైలజానాథ్. జగన్ ను అడ్డుకోవటం కేవలం జగన్ వైపు ప్రజలు వెళ్తున్నారన్న అక్కసు తోనే అన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు,












Click it and Unblock the Notifications