రైతులకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు వరుస శుభవార్తలను అందిస్తున్నారు.ఎన్నికల సమయంలో భారీ హామీలు ఇచ్చి మరీ అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీల అమలుకు శ్రీకారం చూట్టింది. ఇప్పటికే మెగా డీఎస్సీ, పెన్షన్లు పెంపు వంటి హామీలపై సీఎం చంద్రబాబు సంతకాలు చేయడం జరిగింది.ఇప్పటికే బీమా పథకం సొమ్మును రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.ఇంట్లో వ్యక్తి చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు తీసుకొచ్చిన బీమా పథకం సొమ్మును రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు మంత్రి సుభాష్ ప్రకటించారు.
దీని తర్వాత ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని అందించబోతున్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో ఎక్కడ నుంచి అయిన ఫ్రీగా వెళ్లే వెసులుబాటు దీని ద్వారా మహిళలకు కలుగుతోంది. అనంతరం మహిళలకు నెలకు రూ.1500 ఇవ్వడాన్ని ప్రారంభించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి విధి విధానాలను త్వరలోనే జారీ చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది.

తాజాగా కూటమి ప్రభుత్వం రైతులకు సైతం శుభవార్త అందించింది. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన డబ్బులను 48 గంటల్లోనే చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. అంటే 48 గంటల్లోనే డబ్బుల్ని అకౌంట్‌లలో జమ చేయనున్నారు. అలాగే నాణ్యమైన గోతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి బయటపడాలని.. సేకరించిన ధాన్యాన్ని సమీప మిల్లులకే పంపాలని చంద్రబాబు సూచించారు. అంతేకాదు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ధాన్యం బకాయిల్లో కొంత చెల్లించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వ్యవసాయ అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గత సర్కార్ విధానాలను పక్కన పెట్టాలని అధికారులకు సూచించారు. రైతులకు అనుకూలంగా పని చేయాలని, ఆ మేరకు కార్యచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications