ఆర్కే బీచ్ టూ భీమిలి బీచ్.. ఆ ఈవెంట్ కోసం 5 లక్షల మందితో భారీ ప్లాన్
ఆంధ్రప్రదేశ్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు ఈసారి ఘనంగా నిర్వహించనున్నారు. విశాఖపట్నం వేదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సాధారణ పౌరులు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, యోగా సంఘాల సభ్యులు, నేవీ, కోస్టల్ గార్డు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు, కార్మికులు.. ఇలా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తున్నారు.
ఈ మేరకు నేడు మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు యోగా దినోత్సవం గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు.. 5 లక్షల మందితో భారీ స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. ఆరోగ్య కరమైన జీవనానికి యోగా చాలా మంచిదని.. ఎప్పుడైనా అలసట వస్తే ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేస్తే గొప్ప రిలీఫ్ వస్తుందని అన్నారు. మన ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచానికి యోగాను పరిచయం చేశారని కొనియాడారు. రాబోయే మహానాడుకు అందరు యోగా చేయాలని.. యోగా నేర్చుకొని జూన్ 21న విశాఖ రావాలని సూచించారు.

రాష్ట్రంలో ఒకే రోజు 2 కోట్ల మంది యోగా చేయాలని పిలుపునిచ్చారు. విద్యాసంస్థల్లో కూడా ఒక గంట యోగా ప్రాక్టీస్ చేసే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. యోగాలో ట్రైనర్లు, మాస్టర్ ట్రైనర్లను సిద్ధం చేస్తున్నామన్నారు. జూన్ 21న జరిగే యోగా ప్రపంచమంతా ఆశ్చర్య పోయేలా జరగాలని ఆయన పేర్కొన్నారు.
ఇక ఈ వేడుకల కోసం RK బీచ్ కాళీమాత టెంపుల్ నుంచి భీమిలి వరకు యోగా ప్రదర్శనలు నిర్వహించేందుకు భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధన లక్ష్యంగా, మొత్తం మార్గంలో 127 కంపార్ట్‌మెంట్లు ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఒక్కో కంపార్ట్‌మెంట్‌లో వెయ్యిమంది చొప్పున పాల్గొంటారని.. ప్రతి 200×14 మీటర్లకు ఒక కంపార్ట్‌మెంట్ ఉంటుందని, ప్రతి కంపార్ట్‌మెంట్‌కు ఒక ఇన్‌చార్జ్, వైద్య సిబ్బంది, 10 వాలంటీర్లు ఉంటారని అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా ఎల్ఈడీ స్క్రీన్లు, చిన్న స్టేజీలు, సౌండ్ సిస్టమ్ వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నామని వివరించారు.
యోగా దినోత్సవాన్ని ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు 5 లక్షల మందితో నిర్వహించబోతున్నాం. #NTRLivesOn #Yogandhra #Mahanadu2025#TeluguDesamParty#ChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/bnTH5fRkzW
— Telugu Desam Party (@JaiTDP) May 28, 2025
అంతేకాకుండా తాగునీరు, మొబైల్ టాయిలెట్లు, లైఫ్ గార్డులు, గజ ఈతగాళ్ల సాయంతో రక్షణ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు స్పష్టం చేశారు. ఉచితంగా ఆర్గానిక్ బ్రేక్‌ఫాస్ట్ అందించేందుకు సైతం ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే TVOTలు, మాస్టర్ ట్రైనర్లు ఎంపికయ్యారని.. మండల, గ్రామ, సచివాలయ స్థాయిలో శిక్షణలు చేపడతామని కలెక్టర్ పేర్కొన్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
-
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications