వారందరి ఖాతాలలో అక్టోబర్ 4లోగా నగదు జమ.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వర్షాలు, వరదలు కారణంగా విజయవాడతోపాటు అనేక ప్రాంతాలలో ప్రజలు వరదల ముంపుకు గురై నానా అగచాట్లు పడిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మంది వరద బాధితులకు వరద సహాయం అందించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం వరదసాయం ప్రకటించింది.
వరద పరిహారంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ప్రతి ఇంటికి వరద సహాయంగా 25 వేల రూపాయలు అందిస్తామని, మొదటి అంతస్తులో ఉండే వారికి పదివేల రూపాయలు, ఇళ్లల్లో నీళ్లు వచ్చిన బాధితులకు 10000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఇక వరద సహాయం పంపిణీ కూడా ప్రారంభించి వరద బాధితులకు సహాయం అందిస్తున్న క్రమంలో తాజాగా వరద బాధితులకు అందిస్తున్న ఆర్థిక సహాయం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

అక్టోబర్ నాలుగులోగా వారి ఖాతాల్లో నగదు జమ చెయ్యాలి : చంద్రబాబు
వరద సహాయం పంపిణీలో సమస్యలు బాధితుల ఫిర్యాదు పైన సమీక్షించిన ఆయన సాంకేతిక సమస్యలతో 22 185 మంది లబ్ధిదారుల అకౌంటులలో డబ్బులు జమ కాలేదని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వరదల నష్ట పరిహారానికి సంబంధించి నేరుగా బాధితుల ఖాతాలో జమకు సంబంధించి సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఈ నెల నాలుగవ తేదీ నాటికి అందరికీ పరిహారం పంపిణీ పూర్తి కావాలని చంద్రబాబు పేర్కొన్నారు.
ఆ పని చెయ్యాలన్న చంద్రబాబు
వరదల వల్ల నష్టపోయిన వారిలో ఏ ఒక్కరిలో అసంతృప్తి ఉండకూడదని ఆయన అన్నారు. ఎవరి బ్యాంకు ఎకౌంట్లోనైతే డబ్బులు జమకాలేదో వారు బ్యాంకులకు వెళ్లి కేవైసీ ని పరిశీలించుకోవాలని రెండు మూడు రోజుల్లో ఈ సమస్యలను పరిష్కరించి వారి ఖాతాలకు నగదు బదిలీ చేసే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.

అర్హులకు పరిహారం అందేలా చర్యలు
సీఎం చంద్రబాబుతో సమావేశమైన అధికారులు ఇప్పుడు మరికొందరు వరదబాధితులు పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారని వీటిని కూడా పరిశీలించి అర్హులైన వారికి సహాయం అందిస్తున్నామని అధికారులు చెప్పారు. సీఎం చంద్రబాబు మాత్రం పరిహారం అందరి వాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వరద బాధితులకు పరిహారం కోసం గ్రీవెన్స్ లో సమర్పించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులు ఆయా సమస్యలను పరిష్కరించి అర్హులకు పరిహారం అందేలాగా చర్యలు తీసుకుంటారని తెలిపారు.
అధికారులకు చంద్రబాబు ఆదేశం
602 కోట్ల రూపాయల పరిహారం పంపిణీకి సంబంధించి లబ్ధిదారుల ఖాతాలలో ఇప్పటికే 588.59 కోట్ల రూపాయలు జమయ్యాయి. 97 శాతం మంది ఖాతాల్లోకి నగదు జమైందని అధికారులు సీఎంకు వివరించారు. ఎవరికైతే బ్యాంకు ఖాతాలకు నగదు జమకాలేదో వారి ఖాతాలకు సంబంధించి ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించి త్వరితగతిన అందిస్తామని అధికారులు సీఎంకు వెల్లడించారు. అయితే చంద్రబాబు మాత్రం అక్టోబర్ 4లోపు మొత్తం అందరికీ పరిహారం అందేలా చూడాలని ఆదేశాలిచ్చారు.
-
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
స్టాలిన్ చేతికి ఇంటెలిజెన్స్ సర్వే..! షాకింగ్ అంశాలు-ఎక్స్ ఫ్యాక్టర్ గా విజయ్ ? -
today rashiphalalu: ఆర్థికంగా లాభాలున్నాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి












Click it and Unblock the Notifications