Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గర్వంగా ఉంది మై డియర్ భు.. సీఎం చంద్రబాబు ప్రేమపూర్వక సందేశం!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఒక ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని అందుకున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి ప్రతిష్టాత్మక ఐఓడి ఫెలోషిప్ అవార్డు లభించింది. 2025 సంవత్సరానికి గాను ఈ గౌరవ పురస్కారానికి ఆమె ఎంపికైంది. దీంతో సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు భువనేశ్వరి కి అభినందనలు తెలియజేశారు.

భువనేశ్వరికి చంద్రబాబు ప్రేమపూర్వక సందేశం
మై డియర్ భూ అంటూ భువనేశ్వరి పై ప్రేమను వ్యక్తం చేసిన చంద్రబాబు సాధించిన ఘనతకు తనకు ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకమైన ఐ ఓ డి ఫెలోషిప్ అవార్డు 2025 తో నీకు గుర్తింపుని ఇచ్చినందుకు నిన్ను చూసి చాలా గర్వపడుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. నీ అంకితభావం సమగ్రత మరియు శక్తి ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తిని నింపుతుందని చంద్రబాబు భువనేశ్వరిని ఉద్దేశించి పేర్కొన్నారు.

CM Chandrababu loving message to bhuvaneswari on prestigious UK IOD Fellowship award

భువనేశ్వరికి చంద్రబాబు ప్రశంసలు
ప్రతి విజయవంతమైన పురుషుడి వెనక ఒక బలమైన స్త్రీ ఉందని చాలామంది చెబుతారని, కానీ నువ్వు నా విజయం వెనుక కాదు, ఎన్నో మైళ్ళు ముందు ఉన్నావంటూ చంద్రబాబు భువనేశ్వరిని కొనియాడారు. అవార్డును అందుకునే ఘడియ కోసం ఎదురు చూస్తాను మేనేజింగ్ ట్రస్టీ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న భువనేశ్వరి యూకే కు చెందిన ఐఓడి ఫెలోషిప్ అవార్డును నవంబర్ 4వ తేదీన అందుకోనున్నారు.

గతంలో అబ్దుల్ కలాంకు ఈ అరుదైన గౌరవం
అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు 1994లో భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు ఇచ్చారు. వివిధ రంగాలలో విశేష సేవలు అందించే వారు పని చేసే తీరు, సొసైటీకి మేలు చేయడంలోనూ విశిష్టమైన సేవలు చేసిన వారిని, నిబద్ధత కలిగిన వారిని గుర్తించి అందజేస్తారు. ఇక ఈ అవార్డు రావడం పట్ల చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి ప్రేమపూర్వకమైన సందేశాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

కార్పొరేట్ గవర్నెన్స్ లో ఎక్సలెన్స్ అవార్డుపై భువనేశ్వరి ట్వీట్
ఇదిలా ఉంటే యూకేలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ నుండి కార్పొరేట్ గవర్నెన్స్ లో ఎక్సలెన్స్ అవార్డును హెరిటేజ్ ఫుడ్స్ సొంతం చేసుకుందని, ఇదే విషయాన్ని భువనేశ్వరి సోషల్ మీడియా వేదికగా ప్రకటించి ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు పారదర్శకతను, జవాబుదారీతనాన్ని, వాటాదారుల విశ్వాసాన్ని పెంపొందించడం పట్ల తమ అంకితభావాన్ని బలపరుస్తుంది అని అన్నారు.

ఈఅవార్డు వారికే అంకితం అన్న భువనేశ్వరి
ఈ అవార్డును సంస్థ ఉద్యోగులు, భాగస్వాములు, వాటాదారులకు అంకితం చేస్తున్నట్టు పేర్కొన్నారు. నవంబర్లో లండన్ లో జరిగే ప్రపంచ వేదిక పైన ఈ గౌరవాన్ని స్వీకరించడానికి ముందు అత్యున్నత ప్రమాణాలను తమ సంస్థ ద్వారా కొనసాగిస్తామని అందరికీ శాశ్వత విలువను సృష్టించడానికి పని చేస్తామని ఆమె ప్రతిజ్ఞ చేస్తున్నట్టు పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+