నేడు టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం.. కడప, రాజంపేట నేతలతోనూ...

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: టీడీపీ ముఖ్యనేతలతో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. మంత్రులు కళా వెంకట్రావు, యనమల, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు, ఇతర ముఖ్యనేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే కడప, రాజంపేట లోక్‌సభ నియోజకవర్గాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలతో కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం సాయంత్రం సమావేశం కానున్నారు.

పార్టీని పటిష్టపరిచే కార్యక్రమంలో భాగంగా తొలుత పార్లమెంటు నియోజకవర్గాలపై చంద్రబాబు దృష్టిసారించారు. ఇందులో భాగంగానే కడప, రాజంపేట నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ పరిస్థితి, విపక్ష పార్టీల బలబలాలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP CM Chandrababu Naidu is going to conduct a meeting with TDP key leaders here in Amaravathi on Wednesday morning at 10.30 AM, according to source. Later in the evening Babu is will conduct a meeting with Cuddapah and Rajampet leaders. Ministers Kala Venkatrao, Yanamala Ramakrishnudu, Acchennaidu, Kalva Srinivasulu and other important leaders will participate in this meeting. CM Chandrababu is going to discuss on the latest issues in this meeting.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి