జగన్ ను గురి చూసి కొడుతున్న సీఎం, ఆవేశంకాదు, ఆలోచన, పాత చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. 2019 నుండి 2024 వరకు ఏకచక్రాధిపత్యంతో ఆంధ్రప్రదేశ్ ను పాలించిన వైయస్ జగన్ కు చుక్కలు చూపించడానికి ఇతర పార్టీల నాయకులు సిద్ధం అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఎంత రాజకీయ అనుభవం ఉందో అనే విషయాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దేశంలోని ప్రముఖ రాజకీయ పార్టీల నాయకులతో మంచి పరిచయాలు, సంబంధాలు ఉన్నాయి. అటల్ బిహారి వాజ్ పేయి ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఎన్డీఏ ప్రభుత్వంలో చక్రం తిప్పిన నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్లీ దేశ రాజకీయాల్లో మరోసారి అదే తరహాలో చక్రం తిప్పుతున్నారు. తనలో ఇప్పుడు పాత చంద్రబాబును చూస్తారని ఇటీవల సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్న విషయం తెలిసిందే.

రాజకీయాల్లో ఆవేశం పనికిరాదనా, ఆలోచన ముఖ్యం అని నారా చంద్రబాబు నాయుడు నమ్ముతారు.ఇప్పుడు అలాగే సీఎం చంద్రబాబు పావులు కదుపుతున్నారు. గతంలో తనను తీవ్రంగా అవమానించిన మాజీ సీఎం వైస్ జగన్, వైసీపీ నాయకులకి చుక్కలు చూపించడానికి చంద్రబాబు పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయిన నారా చంద్రబాబు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్ ను, వైసీపీని టార్గెట్ చేస్తున్నారు.

CM Chandrababu Naidu is planning to give a big blow to YCP Chief YS Jagan

వైసీపీ లోని ప్రముఖ నాయకులని టీడీపీలో చేర్చుకోవడానికి చంద్రబాబు పక్కాప్లాన్ చేస్తున్నారు. వైసీపీలో జగన్ కి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన నాయకులు ఇప్పుడు పార్టీలు మారిపోతున్నారు. వైసీపీ చెప్పుకోవడానికి సరైన నాయకులను లేకుండా చెయ్యాలని టీడీపీ సిద్దం అయ్యిందని సమాచారం. అయితే జగన్ తీరుతో చాలా మంది నాయకులు విసిగిపోయారని, ఆయన ఒంటెద్దు పోకడలతో విరక్తి చెందిన వైసీపీ నాయకులు చాలా మంది ఇతర పార్టీల వైపు ముగ్గు చూపిస్తున్నారని వెలుగు చూస్తోంది.

పరిస్థితులు అనుకూలించక పోవడం, స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు బహిరంగంగా వ్యతిరేకించడంతో చాలామంది వైసీపీ నాయకులు ఇతర పార్టీల్లో చేరలేక పోతున్నారని సమాచారం. అయితే స్థానిక టీడీపీ నేతలతో చర్చలు జరుపుతున్న సీఎం చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతంలోని వైసీపీ నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం. వైసీపీ నాయకులతోపాటు ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఆ పార్టీ నుంచి ఖాళీ చేయించాలని ప్లాన్ చేస్తున్నారని కొంతమంది టీడీపీ నాయకులు అంటున్నారు.

CM Chandrababu Naidu is planning to give a big blow to YCP Chief YS Jagan

అయితే ఆంధ్రప్రదేశ్ లో జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ నాయకులు ఇప్పుడు వైసీపీ నాయకులను టీడీపీలో చేర్చుకునే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారని, మధ్యలో తేడాలు వస్తే మొదటికే మోసం వస్తుందని కొందరు టీడీపీ నాయకులు అంటున్నారు. కొంతమంది వైసీపీ నాయకులను టీడీపీలో చేర్చుకునే విషయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయుడు అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నారని తెలిసింది. మొత్తం మీద వైసీపీని దెబ్బ కొడితే జగన్ కోలుకోకుండా అయిపోతాడని, ఆ రోజులు ఎంతో దూరంలో లేవని టీడీపీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+