Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహానాడు సాక్షిగా మహిళలకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు

టిడిపి మహానాడు సాక్షిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీలో మహిళలకు శుభవార్త చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పైన ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతీ పండుగకు మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం మహిళలు నిరీక్షిస్తున్నారు.

మహిళలకు శుభవార్త చెప్పిన చంద్రబాబు
మంత్రులు కూడా రకరకాల తేదీలను అనేక మార్లు ప్రకటించారు. కానీ ఇప్పటివరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం సాధ్య పడలేదు. వచ్చే ఆగస్టు 15వ తేదీ నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఇక ఇప్పుడు ఫైనల్ గా చంద్రబాబునే వచ్చే ఆగస్ట్ 15 అని తేదీ చెప్పటంతో ఈసారి పక్కా అని ప్రతీ ఒక్కరూ భావిస్తున్నారు.

CM Chandrababu Naidu said good news to women as a witness to Mahanadu

Take a Poll

మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నాం: చంద్రబాబు
ఏడాది క్రితం రాష్ట్రంలో సంక్షోభం నెలకొందని ప్రస్తుతం ప్రజలలో అశాంతి తగ్గిందని, కూటమి పాలనతో చీకటి తొలగి పోయిందని చంద్రబాబు పేర్కొన్నారు. మహానాడు వేదికపైనే మాట్లాడిన చంద్రబాబు మహిళా సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. మహిళలకు దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని, తల్లికి వందనం బిడ్డల ఉన్నతికి దోహదం చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.

సూపర్ సిక్స్ హామీలు నెరవేరుస్తాం
ఇదే సమయంలో అన్నా క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి తీరుస్తున్నామన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి మళ్లీ స్కూళ్లు తెరిచే లోపల ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ తాము హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు అందిస్తామన్నారు ప్రస్తుతం రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు.

తల్లికి వందనం ఇస్తామన్న చంద్రబాబు
స్కూళ్లు ప్రారంభించడానికి ముందే తల్లుల ఖాతాలలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం నగదును ఇస్తామని వెల్లడించారు. ఇక అన్నదాతలకు న్యాయం చేసేలాగా నిర్ణయాలు తీసుకుంటున్నామని, త్వరలోనే అన్నదాత సుఖీభవ కూడా అందిస్తామన్నారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతామని చంద్రబాబు పేర్కొన్నారు.

చంద్రబాబు ప్రకటనతో మహిళల్లో హర్షం
ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను పూర్తిచేసి ప్రజలలో నమ్మకాన్ని పెంచుతామని చంద్రబాబు తెలిపారు. ఈ మహానాడు ద్వారా మరోమారు ప్రజా సంక్షేమానికి పునరంకితం అవుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. మొత్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపైన చంద్రబాబు చెప్పిన గుడ్ న్యూస్ తో మహిళల్లో హర్షం వ్యక్తం అవుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+