బీజేపీతోనే, మావల్లే తెలంగాణ ధనిక రాష్ట్రం: బాబు, లోకేష్‌కు ప్రశంస
హైదరాబాద్: తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై పోరాటం చేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాబోయే 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీతో కలిసి పని చేసి, పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలన్నారు.
టీడీపీ 34వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఎన్టీఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన వేడుకల్లో చంద్రబాబు మాట్లాడారు. ఎన్టీఆర్ యుగపురుషుడని, తెలుగు ప్రజల గుండెల్లో ఉండిపోతారన్నారు. పాలనలో మార్పులు, సంస్కరణలు తెచ్చింది ఎన్టీఆరేనని అన్నారు. భౌగోళికంగా తెలుగు రాష్ట్రం విడిపోయినా, తెలుగువారు కలిసి ఉండాలని ఆకాంక్షించారు.
తెలంగాణను ధనిక రాష్ట్రంగా చేసింది టీడీపీ ప్రభుత్వమే తప్ప దొంగ కాంగ్రెస్, తెరాస కాదన్నారు. ఎన్టీఆర్ మోడల్ స్కూల్, స్కిల్ డెవలప్‌మెంట్ వంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. టీడీపీ కార్యకర్తలను అన్ని విధాలా ఆదుకుంటామని ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం నారా లోకేష్ సంక్షేమ నిధి ప్రారంభించడం అభినందనీయమన్నారు.

టీడీపీ ఆవిర్భావం
తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై పోరాటం చేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

టీడీపీ ఆవిర్భావం
రాబోయే 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీతో కలిసి పని చేసి, పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలన్నారు.

టీడీపీ ఆవిర్భావం
టీడీపీ 34వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఎన్టీఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన వేడుకల్లో చంద్రబాబు మాట్లాడారు.

టీడీపీ ఆవిర్భావం
ఎన్టీఆర్ యుగపురుషుడని, తెలుగు ప్రజల గుండెల్లో ఉండిపోతారన్నారు. పాలనలో మార్పులు, సంస్కరణలు తెచ్చింది ఎన్టీఆరేనని అన్నారు.

టీడీపీ ఆవిర్భావం
భౌగోళికంగా తెలుగు రాష్ట్రం విడిపోయినా, తెలుగువారు కలిసి ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.

టీడీపీ ఆవిర్భావం
తెలంగాణను ధనిక రాష్ట్రంగా చేసింది టీడీపీ ప్రభుత్వమే తప్ప దొంగ కాంగ్రెస్, తెరాస కాదన్నారు. ఎన్టీఆర్ మోడల్ స్కూల్, స్కిల్ డెవలప్‌మెంట్ వంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.

టీడీపీ ఆవిర్భావం
టీడీపీ కార్యకర్తలను అన్ని విధాలా ఆదుకుంటామని ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామన్నారు.

టీడీపీ ఆవిర్భావం
కార్యకర్తల సంక్షేమం కోసం నారా లోకేష్ సంక్షేమ నిధి ప్రారంభించడం అభినందనీయమన్నారు.

టీడీపీ ఆవిర్భావం
30 రోజుల్లో 54 లక్షలమంది కార్యకర్తలను పార్టీలో చేర్పించారని ఆయన నారా లోకేష్‌ను ప్రశంసించారు. పార్టీ సభ్యత్వంలో ఉన్న కార్యకర్త ప్రమాదవశాత్తూ గాయపడినా, మరణించినా పార్టీ ఇన్స్యూరెన్స్ ద్వారా ఆదుకుంటామన్నారు. ప్రయాణ సౌకర్యాల్లోనూ రాయితీ పొందవచ్చన్నారు.

టీడీపీ ఆవిర్భావం
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్ట్భద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి రామచంద్ర రావు గెలుపునకు కష్టపడిన వారందరినీ చంద్రబాబు అభినందించారు.

టీడీపీ ఆవిర్భావం
2019 అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీతో కలిసి పనిచేసి, పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరారు.

టీడీపీ ఆవిర్భావం
ఎన్టీఆర్‌ను ప్రతి ఒక్క కార్యకర్త స్ఫూర్తిగా తీసుకుని అంకితభావంతో పని చేయాలని సూచించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టేందుకు ప్రతి కార్యకర్త, మహళలు, యువకులు ముందుకు రావాలన్నారు.

టీడీపీ ఆవిర్భావం
ప్రజా సమస్యల పరిష్కారానికి తాము నిరంతరం పోరాటం చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ పేదలు చట్టసభల్లో అడుగుపెట్టేందుకు హక్కును కల్పించిన మహానీయుడు ఎన్టీఆర్ అన్నారు.

టీడీపీ ఆవిర్భావం
2019 ఎన్నికల్లో తెలంగాణలో కూడా టీడీపీ అధికారంలోకి రావడానికి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు.












Click it and Unblock the Notifications