శ్రీవారి భక్తులకు స్కైవాక్ బ్రిడ్జి, కొత్త యాప్ : శ్రీవారి సేవకులు ఇక - చంద్రబాబు..!!

తిరుమల భక్తుల కోసం సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. తిరుమలలో భక్తులకు మరింత మెరుగైన సేవలు, సౌకర్యాలు అందించే లక్ష్యంతో టీటీడీ చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాలను ప్రారంభించారు. టీటీడీ పైన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. శ్రీవాణి నిధులతో ఆలయాల నిర్మాణం పైన సూచనలు అందించారు. అదే విధంగా శ్రీవారి సేవకుల సేవల విస్తరణ పైనా చర్చ జరిగింది. ఇక.. తిరుపతిలో స్కై వాక్ నిర్మాణం పైన చంద్రబాబు స్పష్టత ఇచ్చారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రహ్మోత్సవాల వేళ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇదే సమయంలో తిరుమల హీలింగ్ అండ్ డివోషన్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, దుర్లభ దర్శన్ వీఆర్ అనుభవం, ఎలక్ట్రిక్ బస్సులు, శ్రీ వేంకటేశ్వర మ్యూజియం, నందకం యాప్, భక్తులకు గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం ప్రారంభించారు. టీటీడీ సమీక్ష వేళ పలు నిర్ణయాలు తీసుకున్నారు. అందు లో భాగంగా తిరుపతిలో భక్తులు మరియు పాదచారుల సౌకర్యార్థం రైల్వే స్టేషన్ - బస్టాండ్ మధ్య నూతనంగా "స్కైవాక్" బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రతిపాదనల పైన చర్చించారు.

CM Chandrababu Reveals Key Tirumala Plans Gives Suggestions to TTD on Devotee Amenities here the details

అందుబాటులోకి తెచ్చే విధంగా యాక్షన్ ప్లాన్ ఖరారు చేసారు. పవిత్రమైన దివ్యక్షేత్రంగా తిరుమలను అభివృద్ధి చేయాల నే లక్ష్యంతో పనిచేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. 89.5 శాతం గ్రీన్ కవర్ తిరుమల కొండల్లో ఉందిని.. గతంలో ఏర్పాటు చేసిన ఎస్వీ మ్యూజియం ను ఆధునీకరించి పునః ప్రారంభం చేశామని వెల్లడించారు. శ్రీవారి వైభవం, తిరుమల చరిత్ర, పురాణ గాధలు, శ్రీవారి పరిణయం లాంటి అంశాలను ప్రదర్శించేలా మ్యూజిఎంలో ఏర్పాటు చేశామని చెప్పారు.

ఇంద్రకీలాద్రిపై సామాన్య భక్తులకూ అంతరాలయ దర్శనం, ఈ రోజుల్లో..!!
ఇంద్రకీలాద్రిపై సామాన్య భక్తులకూ అంతరాలయ దర్శనం, ఈ రోజుల్లో..!!

భక్తులకు మెరుగైన వసతుల కోసం

కాగా, భక్తులు అందరికీ అర్ధం అయ్యేలా వివిధ అంశాలను ఏర్పాటు చేశారు. టీసీఎస్ ట్రస్ట్ రూ.104 కోట్లతో ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు. వచ్చే ఐదేళ్ల పాటు ఈ మ్యూజియం నిర్వహణను కూడా ఆ ట్రస్టుకే అప్పగించాలని నిర్ణయించామన్నారు. ప్రతీ భక్తుడికీ ఎల్ఐసీ తో కలిసి భీమా కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఆధార్ బేస్డ్ ఆన్ లైన్ భీమా చేయాలని నిర్ణయించామని వివరించారు. ఎవరైనా భక్తులు దురదృష్ట వశాత్తూ ఇక్కడ మృతి చెందితే వారికి రూ.2 లక్షల ఆర్ధిక సాయం అందించేలా ఈ భీమా వర్తింప చేస్తారని చెప్పుకొచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్సు1 లో దుర్లభ్ దర్శన్ పేరిట ఓ హీలింగ్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

CM Chandrababu Reveals Key Tirumala Plans Gives Suggestions to TTD on Devotee Amenities here the details

శ్రీవారి వైభవం, ఆలయ చరిత్రను ఇతర అంశాలను వివరించేలా ఈ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ఏర్పాటు అయ్యిందని వివరించారు. తిరుమలలో భక్తుల రాకపోకల కోసం 32 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయన్నారు. శ్రీవాణి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 5 వేల దేవాల యాలను నిర్మించాలన్నది ఆలోచనగా వెల్లడించారు. శ్రీవారి సేవకులను కూడా ఈ ఆలయాలకు అనుసంధానించేలా కార్యక్రమం చేపడతామని ప్రకటించారు. నియోజకవర్గ కేంద్రాలు, ఇతర ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మొత్తం ఆరు కార్యక్రమాల ద్వారా తిరుమల అభివృద్ధిని భక్తుల భాగస్వామ్యంతో చేపడతామని చంద్రబాబు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+