ఏలూరు కలెక్టర్ పై చంద్రబాబు సీరియస్..! రీజన్ ఇదే..!
ఏపీలో గతేడాది కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు తరచుగా అధికారులపై ఫైర్ అవుతున్నారు. ఓవైపు తాను దూకుడుగా ముందుకెళ్తుంటే.. అధికారులు మాత్రం ఆ స్ధాయిలో పనిచేయడం లేదనే అసంతృప్తితో ఉన్నారు. అలాగే వారికి 1995 నాటి చంద్రబాబును చూస్తారంటూ హెచ్చరికలు కూడా చేస్తున్నారు. అయినా వారి పని తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఇదే క్రమంలో ఇవాళ ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది.
ఇవాళ నెలలవారీ పెన్షన్ల పంపిణీ కోసం ఏలూరు జిల్లాకు వెళ్లిన సీఎం చంద్రబాబు అక్కడి కలెక్టర్ వెట్రిసెల్విపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా తాను గ్రామసభ నిర్వహిస్తున్నానని, సిబ్బంది మాత్రం కనీస అవగాహన లేకుండా వచ్చారని కలెక్టర్ వెట్రీ సెల్వి ని సీఎం ప్రశ్నించారు. ఒక గ్రామంలో ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయి, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అనే కనీస అవగాహన లేకుండా వచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు. మొక్కుబడిగా గ్రామ సభలు పెట్టొద్దన్నారు. గ్రామాల అభివృద్ధి జరిగే విధంగా, ప్రజల ఆదాయం పెరిగే విధంగా అధికారులు ఆలోచన చేయాలని సూచించారు.

అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. సూపర్ సిక్స్ పథకాలను సక్సెస్ చేసిన ఘనత ఎన్డీయే ప్రభుత్వానిదే అన్నారు. పెన్షన్ల కోసం మన రాష్ట్రం కంటే ఎవరూ ఎక్కువ ఖర్చుపెట్టడం లేదన్నారు. ఏడాదికి 33వేల కోట్లు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీడీపీ కూటమి ప్రభుత్వం అన్నారు. రాష్ట్రంలో వందమందిలో పదమూడు మందికి పెన్షన్లు ఇస్తున్నామన్నారు. వారిలో 59శాతం మంది మహిళలే ఉన్నారన్నారు.

రాష్ట్రానికి కష్టాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఆదాయం లేదని చంద్రబాబు తేల్చేశారు. అయినా ఒకేసారి నాలుగువేలకి పెంచామన్నారు. అప్పటి ప్రభుత్వం ముక్కుతూ,మూలుగుతూ 250 రూపాయల చొప్పున పెంచిందని ఆరోపించారు. జనాభాను పెంచాల్సిన అవసరం ఉందని, లేకపోతే మిషన్లు మనకు సేవ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అప్పటి ప్రభుత్వం రైతులకు 1650 కోట్లు బకాయిలు పెట్టిందని, ఆ బకాయిలు తీర్చడమే కాదు, ఇప్పుడు కొనుగోలు చేసిన ధాన్యానికి నాలుగు గంటల్లో ఇస్తున్నామన్నారు. 25 కోట్లు మంది మహిళలు ఉచిత బస్ పథకాన్ని వినియోగించుకున్నారన్నారు.












Click it and Unblock the Notifications