దేశం దృష్టిని ఆకర్షించేలా నవంబర్ లో మరో మాస్టర్ ప్లాన్ తో చంద్రబాబు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా సంక్షేమం కోసం అనేక నిర్ణయాలను తీసుకుంటూ ప్రజలకు శుభవార్తలు చెబుతోంది. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దీపావళి పండుగ వేళ కూడా రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్తను చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన డి ఏ ను నవంబర్ ఒకటవ తేదీ నుంచి చెల్లించనున్నట్లు ప్రకటించారు.
సిఐఐ భాగ స్వామ్య సదస్సు విషయంలో కీలక అడుగులు
ఇక ఇదే సమయంలో నవంబర్ లో జరగనున్న సిఐఐ భాగ స్వామ్య సదస్సు విషయంలో కీలక అడుగులు వేస్తున్నారు. ఈ సదస్సును చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సదస్సుకు భారత ప్రధాని మోదీని కూడా ఆహ్వానిస్తామని ఇప్పటికే చంద్రబాబు వెల్లడించారు. ఇక ఈ సదస్సు నిర్వహణ కోసం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన అధికారులకు కీలక దిశా నిర్దేశం చేశారు.

సిఐఐ భాగస్వామ్య సదస్సుకు వారికి ఆహ్వానాలు
ఏపీ సీఎం చంద్రబాబు నవంబర్ 14, 15 తేదీలలో విశాఖ వేదికగా జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహణపైన నిన్న వీడియో కాన్ఫరెన్స్ లో దీనిని సక్సెస్ చెయ్యాలని, ఆ దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వెయ్యాలని సూచించారు. . ఈ భాగస్వామ్య సదస్సుకు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే పాలసీ మేకర్స్ ను ఆహ్వానించాలని ఆయన సూచించారు.
ఉన్నత స్థాయి చర్చలకు వేదికగా సిఐఐ సదస్సు
కేవలం రాష్ట్రానికి పెట్టుబడుల కోసం మాత్రమే కాకుండా ఈ సదస్సును నాలెడ్జ్ షేరింగ్, లాజిస్టిక్స్ , టెక్నాలజీ రంగాలలో ఉన్న విధానాలపై ఉన్నత స్థాయి చర్చలకు వేదిక చెయ్యాలని అభిప్రాయపడ్డారు. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే ప్లాన్ తో దీనిని నిర్వహించాలని సూచించారు. దేశం దృష్టిని ఆకర్షించేలా ఈ సదస్సు నిర్వహణకు ప్లాన్ చెయ్యాలని సూచించారు.
పారిశ్రామిక ప్రోత్సాహకాలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
తాజాగా చంద్రబాబు పారిశ్రామిక ప్రగతి కోసం పరిశ్రమలకు ప్రోత్సాహకాలను అందించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పారిశ్రామిక ప్రోత్సాహకాలను విడుదల చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. తొలి విడతగా 1500 కోట్ల రూపాయలు పరిశ్రమలకు రాయితీలను విడుదల చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిశ్రమలకు, వ్యాపారాలకు కేంద్రబిందువుగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యం పెట్టుకున్న చంద్రబాబు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రోత్సాహకాలను ఇవ్వడం, ఏపీలో పారిశ్రామిక వర్గాలకు సంబంధించి ప్రభుత్వ కమిట్మెంట్ కు అద్దం పడుతుందన్నారు. ఇది ఒక కీలక అడుగు అని ఆయన అభివర్ణించారు.
వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేందుకే
రాష్ట్రంలో పరిశ్రమలకు మద్దతుగా నిలుస్తూ, వారి వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడానికి ఈ ప్రోత్సాహకాలను అందిస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆర్థికపరమైన సవాళ్లు ఉన్నా, రాష్ట్ర ప్రగతిలో పాలుపంచుకుంటున్న పారిశ్రామికవేత్తలకు అండగా నిలవాలని ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. అన్ని వర్గాల వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న విషయం తమ నిర్ణయంతో తెలిసిపోతుందని అభిప్రాయపడ్డారు.
పారిశ్రామిక వర్గాలకు సంతోషం
పేదల సంక్షేమాన్ని, ఉద్యోగాల కల్పనను, ప్రభుత్వ అధికారులకు ఆర్థిక చెల్లింపులను చేస్తూ మరో వైపు వ్యాపారులకు ప్రోత్సాహకాలను కూడా అందిస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. చంద్రబాబు తాజా నిర్ణయంతో పారిశ్రామికవేత్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రోత్సాహకాలు అందిస్తూ పరిశ్రమల అభివృద్ధికి చంద్రబాబు దోహదం చేయడం అది కూడా దీపావళి వేళ శుభ నిర్ణయం తీసుకోవడం ఏపీలో పారిశ్రామికవేత్తలకు సంతోషం కలిగిస్తుంది.
-
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications