తుపాను బాధితులకు సాయంపై సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ:కేంద్రం నిర్లక్ష్యం...మేము రూ.1000 కోట్లు ఖర్చు
అమరావతి: తిత్లీ తుపాను బాధితులకు సాయం చేయాలంటూ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. శ్రీకాకుళం ఎన్నడూ లేనంతగా అల్లకల్లోలమైందని సిఎం ఈ లేఖలో పేర్కొన్నారు.
చక్కటి ఉద్యానవనంలాంటి ఉద్దానం ఘోరంగా దెబ్బతిందని, తీవ్ర నష్టంతో దశాబ్దాలు వెనక్కి పోయిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. తిత్లీ తుఫాన్ కారణంగా రూ.3428కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అంచనా వేశామని లేఖలో చంద్రబాబు వెల్లడించారు. సాయం చేయాల్సిన కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని...తుఫాన్ సహాయక చర్యల కోసం ఎపి ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని సిఎం చంద్రబాబు వివరించారు.
Recommended Video


తిత్లీ తుపాను బాధితులకు సాయం చేయాలంటూ ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు తుఫాన్ నష్టం,కేంద్రం నిర్లక్ష్యం, ప్రభుత్వ సాయం తదిదర విషయాలను వివరించారు. తిత్లీ తుఫాన్ కారణంగా రూ.3428కోట్ల వరకు నష్టం వాటిల్లగా...ఇంతటి పెను విపత్తులో సాయం చెయ్యాల్సిన కేంద్ర ప్రభుత్వం
తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని సిఎం చంద్రబాబు ఆరోపించారు.
మరోవైపు ఎపి ప్రభుత్వం శ్రీకాకుళంలో తుఫాన్ సహాయక చర్యల కోసం ఇప్పటికే రూ.1000 కోట్లను ఖర్చు చేసిందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు, ఐఏఎస్‌లు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని తెలిపారు. త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు కృషి చేస్తున్నామని సిఎం వెల్లడించారు. గతంలో ఉక్కు సంకల్పంతో, మనోనిబ్బరంతో హుద్‌హుద్‌ను జయించామన్నారు.
తిత్లీ తుపాన్ విధ్వంసం నుంచి శ్రీకాకుళం జిల్లా తేరుకునేందుకు తూర్పు అనే కార్యక్రమాన్ని రూపొందించామని చంద్రబాబు తెలిపారు. ఇందులో భాగంగా అనేక కార్యక్రమాలు చేపడతామని, తుపాను బాధిత ప్రాంతాలన్నీ పునర్నించాల్సి ఉంటుందన్నారు. స్వచ్ఛంద సంస్థలు, ఆర్థిక స్థోమత కలిగిన కంపెనీలు, ప్రవాసాంధ్రులు, ప్రజలు ఇందుకు ఆర్థికంగా చేయూత అందించాలని సిఎం చంద్రబాబు ఈ బహిరంగ లేఖ ద్వారా పిలుపునిచ్చారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications