ఇక అమిత్ షా సమక్షంలో తాడో పేడో...జగన్-కేసీఆర్ ఒకే వేదికపై..!!
ఈ నెల 14న తిరుపతి వేదికగా కీలక సమావేశం జరగబోతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సమావేశానికి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల సీఎం లు హాజరవుతారా..లేక, మంత్రులు - అధికారులను పంపుతారా అనే మీమాంస కొనసాగింది. అయితే, తాను ఈ సమావేశానికి వెళ్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. తమ రాష్ట్రంలో జరుగుతు న్న సమావేశం..అందునా అమిత్ షా అధ్యక్షతన జరుగుతుండటంతో ఏపీ సీఎం జగన్ సైతం హాజరు కానున్నట్లు సమాచారం.

ఆ సమావేశంలోనే షా కు క్లియర్ గా
కేంద్రం మీద రాజకీయంగా యుద్దం ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం ప్రస్తావిస్తున్న అంశాలు..తెలంగాణలో తక్షణం కేంద్రం నుంచి తీసుకోవాల్సిన నిర్ణయాల పైన ఆయన ఈ సమావేశంలో గళం విప్పేందుకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది. కేంద్రం నుంచి వడ్లు కొనుగోలు అంశం..పెట్రో ఉత్పత్తుల పైన సెస్ తగ్గింపు గురించి ఈ సమావేశంలో కేసీఆర్ ప్రస్తావించనున్నట్లు సమాచారం. అదే సమయంలో తెలంగాణకు రాష్ట్ర విభజన చట్టం మేరకు రావాల్సిన వెనుక బడిన రాష్ట్రాల డెవలప్ మెంట్ ఫండ్ తో పాటుగా నవోదయ విద్యాలయాలు.. గిరిజన యూనివర్సిటీ గురించి కేసీఆర్ పట్టుబట్టే ఛాన్స్ ఉంది.

కేంద్రం తీరును ప్రశ్నిస్తారా
అయితే, అమిత్ షా తో సన్నిహిత సంబంధాలు ఉన్న కేసీఆర్.. ప్రస్తుతం వరుసగా కేంద్రం అన్నింటా వైఫల్యం చెందిందంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టే క్రమంలో కేంద్రం తమ డిమాండ్లు తేల్చే వరకూ ఆందోళనలు...నిరసనలు కంటిన్యూ చేస్తామంటూ ఈ నెల 12న అన్ని నియోజకవర్గాల్లో నిరసనలకు పిలుపునిచ్చారు. ఇక, ఏపీ ప్రభుత్వం సైతం పెట్రోలు - డీజిల్ ధరలు తగ్గించాలనే డిమాండ్ తో ఏపీ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేసింది. ఆ పార్టీ నేతల వ్యాఖ్యలను మంత్రులు తిప్పి కొట్టారు.

ప్రత్యేక హోదా పైన జగన్ ప్రశ్నిస్తారంటూ
ఇక, ప్రత్యేక హోదా అంశాన్ని తిరిగి బలంగా కేంద్రం ముందు వినిపించాలని సీఎం జగన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఏపీకి వస్తున్న అమిత్ షా వద్ద ఇతర ముఖ్యమంత్రుల సమక్షంలోనే ఏపీకి ప్రత్యేక హోదాతో పాటుగా పోలవరం నిధులు.. కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ అంశాల పైన ప్రస్తావించేందుకు జగన్ సిద్దమయ్యారు. ఇప్పటికే ఈ అంశాల పైన అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశం ముందు లేదా ఆ తరువాత అమిత్ షా తో విడిగా సమావేవం కావాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
Recommended Video

ఇద్దరు సీఎంలు ఏం చెప్పబోతున్నారు
ఏపీలో కొద్ది రోజుల క్రితం చోటు చేసుకున్న పరిణామాలు..టీడీపీ నేతలు తీరు..రాష్ట్రపతికి ఫిర్యాదుల అంశం వంటివి ఆయనతో చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి తమిళనాడు..కర్ణాటక.. కేరళ...పుదుచ్చేరి ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు తమను రాష్ట్రపతి..ఉప రాష్ట్రపతి ఎన్నికలతో పాటుగా బిల్లుల ఆమోదానికి అవసరమైన సమయంలో మద్దతు తీసుకుంటూ... తమకు అవసరమైన సాయం చేయటంలో మాత్రం ముందుకు రావటం లేదనే అభిప్రాయంతో ఉన్నారు. దీంతో.. ఇద్దరు ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాలకు సంబంధించిన అంశాల పైన అమిత్ షా సమక్షంలో ఎటువంటి వాదన వినిపిస్తారు.. ఆయన స్పందన ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications