ఆసరా, చేయూత పథకాల నిధుల జమ ముహూర్తం ఖరారు చేసిన సీఎం జగన్..!!
ఏపీలో ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. జనవరి 1 నుంచి ఎన్నికల కార్యాచరణ ఖరారు చేసారు. వరుస పథకాల అమలుకు నిర్ణయించారు. పార్టీ పరంగా అవసరమైన నియోజకవర్గా ల్లో ఇంఛార్జ్ లను మార్చుతున్న జగన్..తాజా పథకాల అమల్లో వారిని భాగస్వాములను చేస్తున్నారు. ఇదే సమయంలో జనవరి నెలలో దాదాపు 1.10 కోటి మంది మహిళల ఖాతాల్లో ఆసరా, చేయూత పథకాల నిధుల విడుదల ముహూర్తం ఖరారు చేసారు.
వరుసగా పథకాల అమలు : జనవరి నెలలో సీఎం జగన్ వరుసగా మూడు ప్రధాన పథకాలను అమలు చేయనున్నారు. జనవరి 1 నుంచి రూ3 వేల వైఎస్సార్ పెన్షన్ కానుక అమలు కానుంది. జనవరి 3న ముఖ్యమంత్రి జగన్ కాకినాడ కేంద్రం గా ఈ పథకం కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక, జనవరిలో ఆసరా పధకం అమలుకు నిర్ణయించారు. పొదుపు సంఘల మహిళలకు ఆసరా పధకం కింద ఇప్పటి వరకు రూ 25,570 కోట్లు ఖర్చు చేసారు. మూడు విడతలుగా ఇప్పటి వరకు రూ 19,195 కోట్లు అందించారు. నాలుగో విడతగా చివరి ఇనిస్టాల్ మెంట్ కింద సుమారు రూ 6,400 కోట్లను జనవరి 23న విడుదల చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. జనవరి 23వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగించాలని సీఎం నిర్దేశించారు.

కోటి 10 లక్షల మంది మహిళలకు లబ్ది : ఆసర కార్యక్రమం ద్వారా 78.94 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూరుతోంది. ఈ పథకంలో భాగంగా పొదుపు సంఘాల మహిలలకు అనేక మల్టీ నేషనల్, ప్రముఖ కంపెనీలతో టై అప్ చేయించారు. బ్యాంకులతోనూ అనుసంధానం చేసారు. అదే విధంగా.. వైఎస్సార్ చేయూత పథకం అమలు..నిధుల జమ పైన సీఎం క్లారిటీ ఇచ్చారు. ఫిబ్రవరి 5 నుంచి 14 వరకూ వైయస్సార్ చేయూత కార్యక్రమం జరుగుతుందని సీఎం వెల్లడించారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకూ రూ.14,129 కోట్లు ఇచ్చినట్లు వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో అట్టడుకు వర్గాల్లో వారికి తోడుగా నిలబడ్డమే కాకుండా, వారికి జీవనోపాధి చూపించే దిశగా ఈ కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు. 45 ఏళ్ల పైబడ్డ ఉన్న మహిళలకు ఏడాదికి రూ.18,750లు అందిస్తున్నారు. 26 లక్షల మందికి పైగా మహిళలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం అందుతుందని చెప్పారు.

ఎన్నికల సమరం : ఈ పథకంలో ఇప్పటివరకు యూనిక్ లబ్ధిదారులు 31,23,466 మంది ఉన్నారు. చివరి విడతద్వారా 26,39,703 మంది లబ్ధి పొందారు. ఈ పథకాల ద్వారా జరిగిన లబ్ది..వస్తున్న మార్పుల పైన ముఖ్యమంత్రి జగన్ లబ్దిదారులకు ఒక లేఖ రాస్తున్నారు. పథకాల అమలు సమయంలో ఆ లేఖతో పాటుగా జగన్ వీడియో సందేశం విడుదల చేస్తున్నారు. దీని ద్వారా జనవరి, ఫిబ్రవరి నెలల్లో మూడు ప్రధాన పథకాలతో దాదాపుగా 1.10 కోటి మంది మహిళలకు మేలు చేయాలని నిర్ణయించారు. ఇదే సమయంలో సంక్రాంతి వేళ మరి కొన్ని కొత్త పథకాల ప్రటకన పైనా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో..కొత్త సంవత్సరం ప్రారంభం నుంచే పథకాల అమలు..ఎన్నికల వాతావరణం ఏపీలో వేడెక్కటం ఖాయంగా కనిపిస్తోంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications