• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చట్టం ముందు అందరూ సమానమే: పోలీసుల సంరక్షణకు కట్టుబడి ఉన్నాం: సీఎం జగన్..!

|

పౌరులు..సమాజ భద్రత కోసం అనుక్షణం పని చేసే పోలీసుల సంరక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. పోలీసుల అమరలవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు ప్రభుత్వం నిర్వహించింది. ఈ సందర్భంగా పోలీసు అమరవీరులకు వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. చట్టం అందరికీ ఒకటే.. కొందరికే చుట్టం కాకూడదని ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. దేశంలో పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు ప్రకటించిన రాష్ట్రం మనదేనన్నారు.

అమరపోలీసులకు సెల్యూట్ చేస్తున్నానని.. మన రాష్ట్ర భద్రత కోసం అనేక సందర్భాలలో మహానుభావులు ప్రాణాలు అర్పించారని జగన్ పేర్కొన్నారు. పోలీస్ టోపీ మీద ఉన్న సింహాలు దేశ సార్వభౌమాదికారాలకు నిదర్శనమని ఆయన అన్నారు. సర్వీసులో ఉన్న పోలీసు సిబ్బందితో పాటుగా పదవీ విరమణ చేసిన పోలీసు సిబ్బందికి భీమా సౌకర్యం కల్పస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు.

CM jagan assured police welfare steps will be taken by govt in Police Commemoration Day

శాంతి భద్రతల విషయంలో రాజీ పడద్దు..

ఏపీలో శాంతి భద్రతల విషయంలో ఎంతటివారికైనా మినహాయింపు ఉండకూడదని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేసారు. బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే ఎంతవారినైన చట్టం ముందు నిలబెట్టమని గతంలో చెప్పిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తప్పు చేసిన వారి హోదాలకు అనుగుణంగా శిక్షలు ఉండకూడదని అభిప్రాయపడ్డారు. చట్టం అనేది అందరికి ఒకటే.. అది కొందరికి చుట్టం కాకూడదని వ్యాఖ్యానించారు.

పోలీసులు ప్రజల మన్ననలు పొందినప్పుడే వారానికి ఒక్కరోజు సెలవులు లేవన్న విషయం తనకు తెలిసి... దేశంలో పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు ప్రకటించిన ఏకైక రాష్ట్రం మనదే అని చెప్పుకొచ్చారు. వారంలో ఒకరోజు పోలీసులు తమ కుటుంబంతో గడిపితే మానసికంగా బలంగా ఉంటారని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. పోలీసుల సంక్షేమం కోసం ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలతో పాటుగా.. తమ ప్రభుత్వం చేయబోయే అంశాలను ముఖ్యమంత్రి వివరించారు. పోలీసులు ప్రజల తరపున నిజాయితీగా యుద్దం చేయాలని పిలుపునిచ్చారు.

సంక్షేమ బాధ్యత ప్రభుత్వానిది..

పోలీసుల పైన సమాజంలో పెద్ద బాధ్యత ఉందని సీఎం చెప్పుకొచ్చారు. సమాజంలో లంచగొండితనం.. అవినీతి.. రౌడీయిజంపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. హోంగార్డుల జీతాలు రూ.21 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తు చేసారు. అదే విధంగా విధి నిర్వహణలో పోలీసులు మరణిస్తే 40 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ సదుపాయాన్ని తీసుకొచ్చామని..పదవీ విరమణ చేసిన పోలీసుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

పోలీసుల సంరక్షణ బాధ్యత ప్రభుత్వం చూసుకుంటుందని..విధి నిర్వహణలో పోలీసులు మంచి పేరు తెప్పించుకోవాలని సీఎం జగన్ సూచించారు. హోం మంత్రి సుచరితతో కలిసి పోలీసు అమరవీరులకు వైఎస్ జగన్ నివాళులు అర్పించారు.

English summary
CM jagan assured police welfare steps will be taken by govt. CM participated in Police Commemoration Day in vijayawada. Cm called for dynmic policing in state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more