Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎం జగన్ బంపరాఫర్..మంత్రులు పిచ్చ హ్యాపీ : ఆశావాహులకు మరింత టెన్షన్: అక్కడే..అసలు ట్విస్ట్..!!

ముఖ్యమంత్రి జగన్ తన కేబినెట్ సహచరులకు బంపరాఫర్ ఇచ్చారు. రెండేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న మంత్రులకు సీఎం జగన్ తొలుత పెట్టిన డెడ్ లైన్ మరో ఆరు నెలలకు ముగియనుంది. దీంతో... అసలు జగన్ కేబినెట్ లో ఉండేదెవరు...కొత్తగా వచ్చే దెవరు అనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో ఈ రెండేళ్ల కాలంలో మంత్రుల పని తీరు మీద అనేక మార్గాల ద్వారా సీఎం సమాచార సేకరణ చేసారు. ప్రభత్వం..పార్టీ పరంగా వారి సేవలను పరిగణలోకి తీసుకున్నారు. వారికి నియోజకవర్గాలు..ఇన్ ఛార్జ్ మంత్రులుగా సక్సెస్ రేట్..శాఖల పైన పట్టు వంటి అంశాలు అన్నింటికి మార్కులు వేస్తున్నారు.

 జగన్ తాజా నిర్ణయం వెనుక..

జగన్ తాజా నిర్ణయం వెనుక..

వీటి ద్వారా ఎవరిని కొనసాగించాలి... కొత్తగా ఎవరికి అవకాశం ఇవ్వాలనే దాని పైన సీఎం జగన్ నిర్ణయం తీసుకోవటానికి డిసైడ్ అయ్యారు. ఇక, ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ తన కేబినెట్ మంత్రులకు బంపరాఫర్ ఇచ్చారు. ఇది ప్రస్తుత మంత్రుల్లో పిచ్చ హ్యాపీని ఇస్తోంది. ఇదే సమయంలో ఈ నిర్ణయం మంత్రివర్గంలో స్థానం ఖాయమని ఆశిస్తున్న వారిలో మరింత టెన్షన్ పెంచుతోంది. తాజాగా, జరిగిన కేబినెట్ సమావేశం తరువాత మంత్రులకు ఈ విషయం పైన స్పష్టత ఇచ్చింది. ముఖ్యమంత్రి జగన్ 2019 జూన్ లో తన కేబినెట్ కూర్పు సమయంలో..పదవులు రాని వారు నిరాశ చెందవద్దని చెప్పారు. రెండున్నార సంవత్సరాల వరకే ప్రస్తుత కేబినెట్ ఉంటుందని..తరువాత 90 శాతం వరకు మార్పులు ఉంటాయని జగన్ స్పష్టం చేసారు.

 మంత్రులకు మరో ఆరు నెలల పొడిగింపు..

మంత్రులకు మరో ఆరు నెలల పొడిగింపు..

దీంతో...రెండేళ్ల కు పైగా సమయం ముగియటంతో ఆవావాహులు జగన్ కేబినెట్ లో బెర్తు కోసం తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. మంత్రులుగా కొనసాగుతున్న వారు సైతం తమ పైన వేటు పడకుండా ముఖ్యమంత్రిని మచ్చిక చేసుకొనే పనిలో పడ్డారు. అయితే, ఇప్పుడు జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. గత ఏడాది..ఈ సంవత్సరం కరోనా కారణంగా దాదాపు 8-9 నెలలు పూర్తిగా కరోనా కే పాలన మొత్తం పరిమితం అయింది. దీంతో..మంత్రులు తమకు అప్పగించిన బాధ్యతలు స్వేచ్ఛగా నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. దీంతో...ముఖ్యమంత్రి తాను ముందుగా డిసైడ్ చేసిన రెండున్నారేళ్ల నిర్ణయాన్ని..మూడేళ్లకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

 సీనియర్ల అయినా ఒకటే విధానం..

సీనియర్ల అయినా ఒకటే విధానం..

దీంతో...ఇప్పుడు మంత్రులుగా ఉన్న వారు పదవుల్లో కొనసాగనున్నారు. కొత్తగా వచ్చే వారికి మాత్రం రెండేళ్ల కాల పరిమితి మాత్రమే ఉండనుంది. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సీనియర్లు కొందరు తమ పదవులు ఖాయం ..తమకు ఇబ్బంది లేదని భావిస్తున్న వారి విషయంలో సీఎం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే కేబినెట్ పూర్తిగా టార్గెట్ -2024 ఎలక్షన్ కేబినెట్ కావటంతో..మొహమాటాలకు అవకాశం లేదని సీఎం తేల్చి చెప్పనున్నారు. ఇతర మంత్రుల కొనసాగింపు విషయంలో ఏ రకమైన అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటున్నారో...సీనియర్లకు అవే వర్తిస్తాయని స్పష్టం చేస్తున్నారు. ఇక, మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్ర -జిల్లా స్థాయి నామినేటెడ్ పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేయనున్నారు.

 పక్కా ప్లాన్...2022 మేలో విస్తరణ..

పక్కా ప్లాన్...2022 మేలో విస్తరణ..

అదే విధంగా జూలై సెకాండాఫ్ నుండి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు దాదాపు 20 రోజుల పాటు నిర్వహణకు ప్రభుత్వం సిద్దం అవుతోంది. ఇక, సీఎం సైతం ప్రజల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. స్వయంగా పధకాల అమలు పర్యవేక్షించనున్నారు. దీంతో...కరోనా తగ్గుముఖం పట్టటంతో పాలనను వేగవంతం చేస్తూనే.. పార్టీ పరంగా మరింత పక్కా నిర్ణయాలు అమలు చేయాలని సీఎం నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో..ప్రస్తుత మంత్రులకు మరింత ఉపశమనం లభించినట్లు కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+