ఎయిడెడ్ పై సీఎం జగన్ తేల్చేసారు - వెనక్కు తీసుకోవచ్చు : రాజకీయాలు సరికాదు..!!
ఎయిడెడ్ విద్యాసంస్థలపైన ప్రభుత్వ ఆలోచనలను సీఎం జగన్ స్పష్టం చేసారు. ఇందులో ఎలాంటి ఒత్తిడి లేదని తేల్చి చెప్పారు. ఎయిడెడ్ విద్యాసంస్థలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని స్పష్టంగా చెప్పారు. కొంత కాలంలో ఏపీలో ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనం పైన ఆందోళనలు సాగుతున్నాయి. రాజకీయ పార్టీలు సైతం ముఖ్యమంత్రి లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్నాయి. దీంతో..ఈ వ్యవహారం పైన ముఖ్యమంత్రి తమ విధానం స్పష్టంగా వెల్లడించారు. విలీనానికి అంగీకరించిన యాజమాన్యాలు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడానికి అవకాశం కల్పించింది.

ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది
ప్రభుత్వంలో విలీనానికి ఇప్పటికే అంగీకారం తెలిపిన ఎయిడెడ్ విద్యాసంస్థలు తిరిగి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనుకుంటే అలా కూడా చేయొచ్చు. దీనికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. యథాతథంగా తమ విద్యాసంస్థలను నడుపుకోవచ్చు' అని సీఎం పేర్కొన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థల చుట్టూ జరుగుతున్న రాజకీయాలు, రెచ్చగొట్టే ధోరణులు బాధాకరమని వ్యాఖ్యానించారు. దీంట్లో రాజకీయాలను తీసుకురావడం దురదృష్టకరమని చెప్పుకొచ్చారు. యిడెడ్ విద్యాసంస్థల యాజమాన్యాలు, అందులో పనిచేస్తున్న టీచర్లు, విద్యార్థులకు మంచి చేయాలనే ఉద్దేశంతో కొన్ని అవకాశాలు కల్పించామని వివరించారు.

ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తున్నారు
గతంలో డబ్బు, ఆస్తిపాస్తులు ఉన్నవారు చారిటీ కింద భవనాలు నిర్మించారు. అందులో ఎయిడెడ్ పాఠశాలలు, కాలేజీలు పెట్టారు. తర్వాత కాలంలో వాటిని నడపడం ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారిందని సీఎం వివరించారు. ఈ విద్యాసంస్థలను నడిపేందుకు యాజమాన్యంలోని వ్యక్తులు సమయం కేటాయించలేకపోతున్నారు. సంస్థ వ్యవహారాలను దగ్గరుండి చూసుకునే పరిస్థితులు లేకుండా పోయాయి. ఈ కారణాలన్నీ కూడా ఎయిడెడ్ సూళ్లు, కాలేజీల నిర్వీర్యానికి దారితీశాయి. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు కూడా తమను ప్రభుత్వంలో భాగంగా గుర్తించాలని చాలాకాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు.

ఐచ్ఛికమే..బలవంతం లేదు
దీంతో..ఈ పరిస్థితుల ను అర్దం చేసుకొని రాష్ట్రప్రభుత్వం ఎయిడెడ్ విద్యాసంస్థల యాజమాన్యాలకు సహాయకారిగా ఐచ్ఛికంతో కూడిన విధంగా, స్వచ్ఛందంగా కొన్ని అవకాశాలు కల్పించిందని వివరించారు. ద్యాసంస్థలను ప్రభుత్వానికి అప్పగిస్తే... నాడు-నేడులో భాగంగా పునరుద్ధరిస్తామన్నారు. విద్యార్థులకు సరిపడా టీచర్లను భర్తీచేస్తామని చెప్పారు. దాతల పేర్లను కొనసాగించడం ద్వారా యాజమాన్యాల ఉద్దేశాలను నెరవేరుస్తామని స్పష్టం చేసారు. ఎయిడెడ్ విద్యాసంస్థల స్థాపన వెనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు అందిస్తున్న తోడ్పాటులో భాగంగా సీఎం స్పష్టత ఇచ్చారు.
Recommended Video

రాజకీయ వివాదానికి ముగింపు
తాము ప్రభుత్వంలో భాగమయ్యేలా చూడాలన్న ఎయిడెడ్ టీచర్ల వారి డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకున్నాం. వారిని సరెండర్ చేసి ప్రైవేటుగా నడుపుకోవచ్చు. లేదా ఇప్పుడు ఉన్నట్టుగా యథాప్రకారం నడుపుకోవచ్చు. ఎయిడెడ్ విద్యాసంస్థల యజమానులకు, అందులో పనిచేస్తున్న టీచర్లకు, విద్యార్థులకు మంచిచేయాలని, మెరుగైన స్కూళ్లుగా వాటిని తీర్చిదిద్ది నడపాలనే ఉద్దేశంతోనే కల్పించిన ఈ అవకాశాలను వారు ఐచ్ఛికంగానే వినియోగించుకోవచ్చు. ఇందులో ఎలాంటి బలవంతం లేదంటూ ముఖ్యమంత్రి ఈ వివాదానికి ముగింపు పలికారు. దీంతో..ఇప్పుడు ఎయిడెడ్ విద్యా సంస్థల నిర్వహకులు తమ అభీష్టానికి అనుగుణంగా ముందుకు వచ్చే వెసులుబాటు ప్రభుత్వం నుంచి లభించింది. దీంతో..రాజకీయ వివాదానికి ముగింపు పలికేందుకు సీఎం ప్రయత్నించారు.












Click it and Unblock the Notifications