విజయవాడ నడి బొడ్డున - సీఎం జగన్ కీలక ఆదేశాలు..!!
ముఖ్యమంత్రి జగన్ విజయవాడ కేంద్రంగా కీలక సూచనలు చేసారు. ఏపీలో మూడు రాజధానుల రాజకీయంతో విజయవాడ అధికార - ప్రతిపక్షాలకు కీలకంగా మారింది. అక్కడ ఇప్పటికే టీడీపీ ఎంపీ కేశినేని నాని వర్సస్ నగర టీడీపీ నేతల పంచాయితీ కొనసాగుతోంది. విజయవాడలో రెండు నియోజకవర్గాల్లో ఇద్దరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. తూర్పు నియోజకవర్గం నుంచి దేవినేని అనినాశ్ కు సీఎం జగన్ బాధ్యతలు అప్పగించారు. ఇక, ఇప్పుడు విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమయంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, స్మృతివనం నిర్మాణ పనులు మార్చి నెలాఖరు కల్లా పూర్తి అవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. విగ్రహం తయారీ, దానిచుట్టూ సివిల్ వర్క్స్, సుందరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే అంశాలపై పలు సూచనలు చేసారు. విగ్రహ పీఠంతో కలుపుకుని మొత్తంగా 206 అడుగుల పొడవు వస్తుందని అధికారులు వివరించారు. అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టు వ్యయం మొత్తంగా రూ.268 కోట్లుగా నిర్ణయించారు. పీఠం భాగంలో జీ ప్లస్ టూ నిర్మాణం ఉంటుందని అధికారులు లెక్కలు చెప్పారు. ప్రాంగణంలో ఒక కన్వెన్షన్ సెంటర్ కూడా వస్తుందని అధికారులు వెల్లడించారు. విగ్రహ నిర్మాణంలో 352 మెట్రిక్ టన్నుల ఉక్కు, 112 మెట్రిక్ టన్నుల ఇత్తడిని వినియోగిస్తున్నామని అధికారులు చెప్పారు.

దాదాపు 2 వేల మంది పట్టేలా కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మిస్తున్నారు. మార్చి నెలాఖరు కల్లా విగ్రహ నిర్మాణ పనులు పూర్తిచేస్తామని అధికారులు స్పష్టం చేసారు. జనవరి 31 కల్లా విగ్రహానికి సంబంధించి కాస్టింగ్ చేసిన భాగాలన్నీ తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు జరిగాయి. ఇప్పటికే కొన్ని విగ్రహ భాగాలను తరలింపు పూర్తయింది. దాదాపు 2 వేల మంది పట్టేలా కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మిస్తున్నామని అధికారులు వెల్లడించారు. కార్ పార్కింగ్, బస్ పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం కేటాయిస్తున్నట్లు అధికారులు చెప్పారు.ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. నిర్దేశిత సమయంలోగా అన్ని పనులు పూర్తిచేయాలని సీఎం స్పష్టం చేసారు. అత్యంత నాణ్యతతో, అందంగా నిర్మాణాలు ఉండాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. పనుల పర్యవేక్షణకు ఉన్నతస్థాయి అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.












Click it and Unblock the Notifications