సీఎం జగన్‌కు డిగ్రీలో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా..?
వైసీపీ అధినేత, సీఎం జగన్‌పై రాజకీయ ప్రత్యర్థులు చాలానే ఆరోపణలు చేశారు. జగన్ సీఎం అవకముందు, ఆయన ఓ అవినీతిపరుడని, జైలుకు వెళ్లారని ఎద్దెవా చేశారు. అయితే జగన్‌కు సంబంధించిన విద్య గురించి కూడా విపక్షాలు ఆయనపై మాటల దాడి చేశాయి. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ..జగన్ ఏం చదివారో.. ఎక్కడ చదివారో ఎవరికి తెలియదంటూ ఎద్దెవా చేశారు.
దీనిపై చంద్రబాబుకు కౌంటరిస్తూ.. జగన్ తాను ఎక్కడ చదివానో ఎన్ని మార్కులు వచ్చాయో వివరించారు. నేను టెన్త్‌లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్‌లో, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్.. కావాలంటే తాను చదివిన స్కూలు, కాలేజీలకు వెళ్లి ఆ రికార్డులు చెక్ చేసుకోండి అంటూ చంద్రబాబుపై జగన్ ఫైర్ అయ్యారు. తాజాగా సీఎం జగన్ డిగ్రీకి సంబంధించిన మార్కుల లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఇంటర్ పూర్తి చేసుకున్న జగన్.. ప్రగతి మహావిద్యాలయంలో డిగ్రీలో చేరారు.

కామర్స్ ప్రధాన సబ్జెక్టుగా మూడేళ్లు డిగ్రీ అక్కడే పూర్తి చేశారు. చంద్రబాబు ఆరోపించినట్టుగా జగన్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ కాదు. డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. 740 మార్కులను జగన్ సాధించారు. 1994 జూన్ 17న ఆ మార్కుల జాబితాను ప్రగతి మహావిద్యాలయ డిగ్రీ కళాశాల జారీ చేసింది. ఈ కళాశాల ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా పనిచేస్తుంది. మార్కుల జాబితాలో జగన్ తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు కూడా స్పష్టంగా కనిపిస్తోంది.
బిజినెస్ రిలేటెడ్ డిగ్రీ కావడంతో జగన్ తొలుత వ్యాపార రంగంలో అడుగు పెట్టారు. ఆ తరువాత 2009లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. తండ్రి మరణంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి. సొంతంగా వైసీపీ స్థాపించారు. 2014 ఎన్నికల్లో తృటిలో కోల్పోయిన అధికారాన్ని..2019లో సాధించి సీఎం అయ్యారు. ఇన్నాళ్లు జగన్ చదువుకు సంబంధించిన దానిపై ఓ మిస్టరీ ఉండేది. కానీ ఇప్పుడు జగన్ డిగ్రీ మార్కుల లిస్ట్ బయటకు రావడంతో ఇకపై ఇలాంటి విమర్శలకు తెరదించినట్టే అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications