ఆసరా, చేయూత నిధుల విడుదలపై సీఎం జగన్ కీలక ప్రకటన..!!

ఏపీలో ఎన్నికలకు సీఎం జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. రాజకీయంగా అవసరమైన నియోకవర్గాల్లో ఇంఛార్జ్ లను మార్పు చేస్తున్నారు. గెలుపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇదే మయంలో పాలనా పరంగానూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జనవరి 1 నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు ఎన్నికల రోడ్ మ్యాప్ ఫిక్స్ చేసారు. ఇక..అన్ని హామీల అమలు పైనా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు.

జగన్ దిశా నిర్దేశం : జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి జగన్‌సమీక్ష నిర్వహించారు. డియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లతో సమావేశమయ్యారు. పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై అధికారులతో సీఎం సమీక్ష జరిపారు. అంబేద్కర్‌ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. జనవరిలో 3, ఫిబ్రవరిలో 1, మొత్తంగా నాలుగు ప్రధానమైన కార్యక్రమాలు చేస్తున్నామని, ఎక్కడాకూడా పొరపాట్లు లేకుండా చూసుకోవాలని సీఎం సూచించారు. ప్రతి కార్యక్రమానికి ప్రీలాంచ్‌, లాంచ్‌, పోస్ట్‌ లాంచ్‌ కార్యక్రమాలు ఉంటాయన్నారు. జనవరి నుంచి వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక రూ.3 వేలకు పెంచుతాం. రూ.3 వేలకు పెన్షన్‌ పెంచుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేరుస్తున్నామని కీలక ప్రకటన చేసారు. విశ్వసనీయతకు ఈ ప్రభుత్వం మారు పేరు అని రుజువు చేస్తున్నామని సీఎం చెప్పారు.

CM Jagan Fixed Road map for next elections for party leaders and officials, issues key directions

వరుస పథకాలు : నెలకు 400 కోట్ల మాత్రమే గత ప్రభుత్వంలో సగటున పెన్షన్ల కోసం ఖర్చు చేసేవారని జగన్ గుర్తు చేసారు. ఇప్పుడు నెలకు రూ.1950 కోట్ల ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. గత ప్రభుత్వంలో పెన్షన్ల సంఖ్య 39 లక్షలు కాగా ఇప్పుడు 66 లక్షలకు చేరందని చెప్పారు. జనవరి 19న అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామన్నారు. జనవరి 23 నుంచి 31 ఆసరా కార్యక్రమం జరుగుతుందని వివరించారు. నాలుగో కార్యక్రమం వైఎస్సార్‌ చేయూత కార్యక్రమం ఫిబ్రవరి 5 నుంచి 14వరకూ కొనసాగుతుందని ప్రకటించారు. ప్రభుత్వం చాలా ప్రతిష్ట్మాత్మకంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుందని చెప్పారు. అర్హత ఉండీ ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోయిన సందర్భాల్లో వారికి పథకాలు వర్తింపు చేసే బై యాన్యువల్‌ కార్యక్రమం జనవరి 5న జరుగుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు.

CM Jagan Fixed Road map for next elections for party leaders and officials, issues key directions

ప్రతీ హామీ నెరవేరుస్తాం : ప్రజా ప్రతినిధులు అందరూ కూడా పెన్షన్‌ కానుక కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సీఎం నిర్దేశించారు. ఎమ్మెల్యేలు ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. 8 రోజులపాటు పెంచిన పెన్షన్లతో పెన్షన్‌ కానుక కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. పెన్షన్‌తోపాటు నా తరఫున లేఖను కూడా లబ్ధిదారులకు అందించాలని సూచించారు. ఆసరా, సున్నావడ్డీ, చేయూత, అమ్మ ఒడి పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగామన్నారు. ఆసరా కోసమే రూ.25,570 కోట్లు ఖర్చు చేశాం. మూడు విడతలుగా ఇప్పటికే రూ.19,,195 కోట్లు ఇచ్చామని వివరించారు. చివరి విడతగా 6,394 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. జనవరి 23 నుంచి 31వ తేదీ వరకూ కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా 78.94 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారని సీఎం వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+