సీనియర్లకు తేల్చి చెప్పిన సీఎం జగన్ - డోర్స్ ఓపెన్..!!
ఎన్నికలకు సీఎం జగన్ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. పార్టీలో - ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ నేతలతో వరుసగా రెండు రోజుల సమీక్షలు నిర్వహించిన సీఎం .. వారికి కీలక దిశా నిర్దేశం చేసారు. వై నాట్ 175 అంటూ టార్గెట్ 2024 రూట్‌మ్యాప్ ఫిక్స్ చేసారు.
అసంతృప్తి ఎక్కడైనా ఉంటే గుర్తించి..సరి చేసే బాధ్యత తీసుకోవాలని ప్రాంతీయ సమన్వయ కర్తలకు సీఎం స్ఫష్టం చేసారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ సూచించారు. ఎప్పుడైనా రీజనల్ కో ఆర్డినేటర్లు తనను కలవచ్చని సీఎం స్పష్టం చేసారు.

ముఖ్యమంత్రి జగన్ పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్లకు కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీ పరంగా కో ఆర్డినేటర్లు టాప్ టీంగా పేర్కొన్నారు. ఎన్నికలకు ఇంకా సంవత్సరం సమయమే ఉందని.. కో ఆర్డినేటర్లు ఓనర్ షిప్ తీసుకోవాలని సూచించారు. అప్పగించిన జిల్లాల్లో పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత సమన్వకర్తలదేనని తేల్చి చెప్పారు.
ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్ది అందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని స్పష్టం చేసారు. అంతిమంగా ప్రతీ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్దులే గెలవాలనేది టార్గెట్ గా పని చేయాలని సీఎం జగన్ తేల్చి చెప్పారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ సూచించారు.
తనతో సహా అందరూ కలిసి సాగి గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని సీఎం స్పష్టం చేసారు. ఎన్నికల వరకు పార్టీ నేతలంతా ప్రజలతోనే ఉండాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఎన్నికల వరకు పార్టీ యంత్రాంగానికి కార్యక్రమాలను నిర్దేశించామని, ప్రతీ ఇంటికి ప్రభుత్వం చేసిన మంచి ఖచ్చితంగా వివరించే విధంగా కార్యాచరణ అమలు చేయాలన్నారు.
ఇచ్చిన ప్రతీ మాట అమలు చేస్తూ, ప్రతీ ఇంటికి సంక్షేమం అందిస్తూ సాగిన పాలన గురించి వివరించాలన్నారు. పార్టీ నిర్ణయించిన కార్యక్రమాలు ఖచ్చితంగా నియోజకవర్గాల్లో అమయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రాంతీయ సమన్వయ కర్తలు తీసుకోవాలని సీఎం జగన్ నిర్దేశించారు. సీఎం జగన్ నిర్వహిస్తున్న వరుస సమావేశాలు.. కొత్త రూట్ మ్యాప్ రాజకీయంగా ఉత్కంఠను పెంచుతున్నాయి.












Click it and Unblock the Notifications