సీజేఐ ఎన్వీరమణకు సీఎం జగన్ విందు : అందరూ కలిసి..!!
సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ కు ఏపీ ప్రభుత్వం ఆతిథ్యం ఇచ్చింది. సీజేఐ హోదాలో విజయవాడకు వచ్చిన సీజేఐకు సీఎం జగన్ ఆత్మీయ విందు ఏర్పాటు చేసారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ విందులో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన తో పాటుగా హైకోర్టు సీజే ప్రశాంత్‌కుమార్ మిశ్రా, పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి దంపతులు ముందుగా కన్వెన్షన్ సెంటర్ కు వచ్చిన సీజేఐ రమణ దంపతులకు స్వాగతం పలికారు.
ఆ తరువాత గవర్నర్ ను సీఎం రిసీవ్ చేసుకున్నారు. సీజేఐ దంపతులు - గవర్నర్ - ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులతో పాటుగా సీఎం జగన్ - భారతి ఒకే టేబుల్ పంచుకున్నారు. న్యాయమూర్తులు అందరినీ సీఎం పలకరించి..వారిని విందుకు ఆహ్వానించారు. ఈ నెల 27న సీజేఐ పదవి నుంచి జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ చేయనున్నారు. ఈ రోజున ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో సీజేఐకు గౌరవ డాక్టరేట ప్రధానం జరిగింది. అంతకు ముందు విజయవాడలో నిర్మించిన కోర్టు భవనాలను సీజేఐ - సీఎం ఇద్దరూ ప్రారంభించారు.

ఇక, ఏపీలో కోర్టుల నిర్మాణానికి సహకరించాలని సీజేఐ సీఎం ను కోరారు. అదే సమయంలో కేంద్రం నుంచి ఏపీకి సాయం అందాలని..మరింతగా ఆర్దిక తోడ్పాటు అందించాలని సీజేఐ పేర్కొన్నారు. మూడు రోజుల ఏపీ పర్యటనలో భాగంగా.. తిరుమలలో శ్రీవారి దర్శనం తో ప్రారంభించిన సీజేఐ తన స్వగ్రామం సందర్శించటం తో పర్యటన ముగియనుంది.












Click it and Unblock the Notifications