దిశ పోలీసు స్టేషన్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌.. నేటి నుండి ఏపీలో ప్రత్యేకంగా మహిళలు, బాలికల భద్రత

Recommended Video

    AP CM YS Jagan On Disha Call Center And Disha Application At Rajahmundry | Oneindia Telugu

    ఏపీ సీఎం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన చట్టం దిశ చట్టం 2019. ఈ చట్టాన్ని అమలు చెయ్యటానికి ఏపీ సర్కార్ దృఢ నిశ్చయంతో ఉంది అందులో భాగంగా పకడ్బందీగా దిశ చట్టాన్ని అమలు చేయడానికి ప్రతీ జిల్లాలోనూ దిశా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చెయ్యనున్నారు . రాజమండ్రిలో నేడు సీఎం చేతుల మీదుగా దిశా పోలీస్ స్టేషన్ ప్రారంభం అయ్యింది. ఇక నేటి నుండి దిశా పోలీస్ స్టేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి.

     రాజమండ్రిలో దిశా తొలి పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభించిన సీఎం జగన్

    రాజమండ్రిలో దిశా తొలి పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభించిన సీఎం జగన్

    ఇక ఏపీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మహిళలు, బాలల భద్రత కోసం ప్రవేశపెట్టిన దిశా చట్టం అమలులో భాగంగా రాజమండ్రిలో దిశా తొలి పోలీస్‌ స్టేషన్‌ను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు ప్రారంభించారు. మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన దిశ ప్రత్యేక పోలీసు స్టేషన్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే రోజా, డీజీపీ గౌతం సవాంగ్‌, దిశ చట్టం పర్యవేక్షణా అధికారులు దీపిక పాటిల్, కృతికా శుక్లా తదితరులు పాల్గొన్నారు .

    రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు

    రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు

    జిల్లాకో ప్రత్యేక కోర్టు తో పాటు ప్రత్యేక మహిళా పోలీస్‌ స్టేషన్ ను ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం అందుకు నేటి నుండి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 దిశ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేసి మహిళలకు , బాలికలకు భద్రత కల్పించనుంది. ఒక్కో స్టేషన్‌లో డీఎస్పీలు, సీఐలు ఇద్దరు, ఐదుగురు ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లతో కలిపి మొత్తం 52 మంది పోలీస్‌ సిబ్బంది ఉంటారు. ఇక వీరు మహిళా, బాలికా భద్రత కోసం పని చేస్తారు.

    దిశా చట్టం అమలు దిశగా ఏపీ సర్కార్ అడుగులు

    దిశా చట్టం అమలు దిశగా ఏపీ సర్కార్ అడుగులు

    ఇప్పటికే దిశ చట్టంపై అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐఏఎస్‌ అధికారిణి కృతికా శుక్లా, ఐపీఎస్‌ అధికారి దీపికను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించిన విషయం తెలిసిందే. ఇప్పటికే దిశా యాప్ ను అందుబాటులోకి తీసుకురావటమే కాకుండా, ప్రతి జిల్లాలోనూ దిశా న్యాయస్థానం ఏర్పాటుకు కూడా కృషి చేస్తున్నారు. రోజురోజుకీ పెరిగిపోతున్న అత్యాచారాలకు అడ్డుకట్ట వేసే పనిలో ఏపీ సర్కార్ చేస్తున్న ఈ ప్రయత్నం ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలి .

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+