వెనుకాడేది లేదు, మీ నుంచి కావాల్సింది ఇదే - సీఎం జగన్..!!
రాష్ట్రంలో చంద్రబాబు అరెస్ట్ తో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి జగన్ తన నిర్ణయాలు తీసుకుంటున్నారు. విజయనగరం నుంచి ఒకేసారి అయిదు మెడకల్ కాలేజీల ను సీఎం జగన్ ప్రారంభించారు. తన హయాంలో అమలు చేస్తున్న సంక్షేమాన్ని వివరిస్తూనే..వైద్య ఆరోగ్యానికి ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. ఇదే సమయంలో కీలక దిశా నిర్దేశం చేసారు. రాష్ట్రంలో కొత్త చరిత్ర మొదలు అయిందని చెప్పారు.
ఏపీలో ఒకేసారి ఐదు మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. శుక్రవారం విజయనగరం గాజులరేగలో నిర్మించిన మెడికల్ కాలేజీ ప్రారంభించి.. ఆ ప్రాంగణం నుంచి వర్చువల్‌గా మిగతా నాలుగు మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. వర్చువల్ విధానంలో రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో ముఖ్యంత్రి జగన్ తన ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమాన్ని ప్రస్తావించారు వైద్య ఆరోగ్యానికి ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తుందని చెప్పుకొచ్చారు. స్వతంత్రం వచ్చాక ఏపీలో కేవలం 11 మెడికల్ కాలేజీలే ఉన్నాయని గుర్తు చేసారు. అందుకే ఈ 11 మెడికల్ కాలేజీలకు మరో 17 మెడికల్ కాలేజీలను చేర్చి 28 మెడికల్ కాలేజీల దిశగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు.

ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఓ మెడికల్ కాలేజీ ఉండబోతోందన్నారు. ఇవాళ ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించుకున్నామని, వచ్చే ఏడాది మరో ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఆ మరుసటి ఏడాది మరో ఏడు కాలేజీలు ప్రారంభిస్తామని ప్రకటించారు. వైద్య విద్యార్దులంతా గొప్ప డాక్టర్లు కావాలని ఆకాంక్షించారు. అత్యున్నత స్థాయికి చేరుకోవాలని అభిలషంచారు. ఈ 17 మెడికల్ కాలేజీలు కట్టడం కోసం దాదాపు రూ.8,480 కోట్లు ఖర్చు చేస్తున్నాట్లు చెప్పారు. ఈ కాలేజీల వల్ల కొత్తగా 2,250 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయన్నారు. దీంతో.. మొత్తంగా ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 4,735 సీట్లకు చేరుతుందని, ఈ ఒక్క ఏడాదే 609 పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయని సీఎం వెల్లడించారు.
ప్రజలకు వైద్యం..వైద్యులను అందుబాటులోకి తెచ్చేందుకు ఖర్చు ఎంతైనా వెనకాడడం లేదన్నారు. రాబోయే రోజుల్లో.. వెనకబడిన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు వస్తాయన్నారు. గిరిజన ప్రాంతాలతో పాటు వైద్యసదుపాయాలకు దూరంగా మారుమూల ప్రాంతాల్లోనూ మెడికల్ కాలేజీల ఏర్పాటు ఉండనుందని సీఎం జగన్ తెలిపారు. ఏపీ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందాలి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చామని వివరించారు. హెల్త్ సెక్టార్‌లో 53 వేలమందిని రిక్రూట్ చేశామని... కొత్తగా 18 నర్సింగ్ కాలేజీలను తీసుకొస్తున్నామన్నారు. ప్రస్తుత కాలేజీల్లో మౌలిక సదుపాయాల్ని మెరుగుపరుస్తామని చెప్పారు. వైద్య రంగంలో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తున్నాం అని సీఎం జగన్ వివరించారు.












Click it and Unblock the Notifications