పీఎస్‌, పీఏ, ఓఎస్డీలుగా కొత్తవారే.. టీడీపీ మంత్రుల దగ్గర పనిచేసిన వాళ్ళు వద్దన్న సీఎం జగన్

Recommended Video

    TDP మంత్రుల దగ్గర పనిచేసిన వాళ్ళు వద్దు - జగన్|AP CM Not Interested In officers Who Worked With TDP

    టిడిపి హయాంలో పనిచేసిన పిఎస్, పిఓ, ఓఎస్డీ లకు షాక్ ఇచ్చారు ఏపీ సీఎం వైయస్ జగన్. గత ఎన్నికల్లో టి.డి.పి ఓటమి పాలు కావడంతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం వైసిపి మంత్రుల వద్ద గతంలో తాము చేసిన పోస్టులలోనే కొనసాగాలన్న ఉద్దేశంతో చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వారి ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పెట్టారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.

    టీడీపీ హయాంలో మంత్రుల దగ్గర పని చేసిన సిబ్బందికి చెక్ పెట్టిన జగన్

    టీడీపీ హయాంలో మంత్రుల దగ్గర పని చేసిన సిబ్బందికి చెక్ పెట్టిన జగన్

    తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మంత్రుల వద్ద పనిచేసిన సిబ్బంది ఎవరినీ తిరిగి అదే పోస్టుల్లో లేదా వేరే కీలక బాధ్యతల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోవద్దని ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. అప్పటి మంత్రుల కార్యాలయాల్లో ఆఫీసర్స్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ, ప్రైవేట్‌ కార్యదర్శులు, అదనపు ప్రైవేట్‌ కార్యదర్శులు, వ్యక్తిగత సహాయకులుగా పలువురు పనిచేశారు. ఇక వారందరికీ మళ్ళీ క్యాబినెట్ మంత్రుల వద్ద పని చేసే అవకాశం ఇవ్వరాదని తేల్చి చెప్పేశారు.

    కొత్త మంత్రుల దగ్గర పోస్టుల కోసం ప్రయత్నాలు చేస్తున్న సిబ్బంది . వారిని తీసుకోవద్దని జగన్ క్లారిటీ

    కొత్త మంత్రుల దగ్గర పోస్టుల కోసం ప్రయత్నాలు చేస్తున్న సిబ్బంది . వారిని తీసుకోవద్దని జగన్ క్లారిటీ

    తాజాగా ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ ఫుల్ క్లారిటీతో ముందుకు పోతుంది. ఇక ఏపీలో పాత ప్రభుత్వ స్థానంలో వైసీపీ సర్కార్ ఏర్పాటు కావటంతో , కొత్త మంత్రులు రావడంతో ఇంతకాలం పని చేసిన వీరంతా తిరిగి అవే పోస్టుల్లో కొనసాగేందుకు తమవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కానీ జగన్ వారి ఆశల మీద నీళ్ళు పోశారు. అయితే అప్పటి మంత్రుల వద్ద పనిచేసిన వారెవరినీ తీసుకోవద్దని, ఈ విషయంలో కచ్చితంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి జగన్‌ ముఖ్య సలహాదారు అజేయ కల్లంకు సూచించడంతో వీరి ప్రయత్నాలకు బ్రేక్‌ పడినట్టే అయ్యింది. సిబ్బంది నియామకాల్లో ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

    జగన్ మంత్రుల దగ్గర పని చేసిన సిబ్బంది విషయంలో నిర్ణయం తీసుకుంది ఇందుకే

    జగన్ మంత్రుల దగ్గర పని చేసిన సిబ్బంది విషయంలో నిర్ణయం తీసుకుంది ఇందుకే

    జగన్ ఈ తరహా నిర్ణయం తీసుకోటానికి కారణాలు లేకపోలేదు. గత ప్రభుత్వ హయాంలో పని చేసిన సిబ్బందితో గతంలో పని చేసిన మంత్రులకు ఇంతో అంతో సాన్నిహిత్యం ఉంటుంది. ఇక ఆ సాన్నిహిత్యంతో మంత్రులకు సంబంధించిన ప్రతీ విషయం , పాలనకు సంబంధించిన ప్రతీ విషయం, ఇక పాలన విషయంలో గోప్యత పాటించాల్సిన అనేక విషయాలు గత పాలకులకు తెలిసే ప్రమాదం వుందని భావించిన నేపధ్యంలోనే జగన్ ఈ తరహా నిర్ణయం తీసుకుని ఉంటారని భావిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+