ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు అర్జునుడు - జగన్ గర్జన..!!
ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల సమరశంఖం పూరించారు. ఎంత మంది కలిసినా...ఎన్ని ఎత్తులు వేసినా..వారి వ్యూహంలో చిక్కుకోవటానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదని..అర్జునుడు అంటూ తాను ఏ స్థాయి లో సిద్దంగా ఉన్నది తేల్చి చెప్పారు. చంద్రబాబుతో సహా అందరూ ఓడాల్సిందేనని నినదించారు. మీ మద్దతు ఉన్నంత కాలం తొణకను..బెణకను అంటూ సీఎం జగన్ గర్జించారు. 175కి 175 సీట్లు గెలవాల్సిందే అంటూ...ఈ బాధ్యత ప్రతీ కార్యకర్త తీసుకోవాలని జగన్ పిలుపునిచ్చారు.
ఎవరికీ బెదరను : ముఖ్యమంత్రి జగన్ దేవుడి దయ..ప్రజల మద్దతు ఉన్నంత కాలం ఎవరికీ బెదరనని చెప్పుకొచ్చారు. భీమిలో సిద్దం సభ ద్వారా ఎన్నికల్లో తన లక్ష్యం ఏంటో జగన్ చాలి చెప్పారు. పార్టీ జైత్రయాత్ర కొనసాగాలని.. మరో 25 ఏళ్లు సంక్షేమం - అభివృద్ధి పాలనకు ఇది సన్నాహక సమావేశంగా జగన్ విశ్లేషించారు. చంద్రబాబు ఒంటరిగా గెలవలేక పొత్తుల కోసం పాకులాడుతున్నారని ఎద్దేవా చేసారు. మంచి చేసానని ..తనకు ఓటు వేయమని అడగలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారని ఎద్దేవా చేసారు. ఏం చేయని చంద్రబాబు మరోసారిగా కొత్త వాగ్దానాల గారడీతో ప్రజల ముందుకొస్తున్నారని చెప్పుకొచ్చారు. తన ప్రభుత్వం చేసిన మంచి పనులే తనను గెలిపిస్తాయని జగన్ ధీమా వ్యక్తం చేసారు. 175 సీట్లు గెలవాల్సిందేనని నినదించారు.


ఓటు వేయకుండా ఉండగలరా : చంద్రబాబువి పెత్తందార్ల పాలన, పెత్తందార్ల ఆలోచనగా జగన్ వివరించారు. రైతులను రుణమాఫీ పేరుతో మోసం చేసారని గుర్తు చేసారు. రైతు భరోసా అంటే జగన్ గుర్తుకు వస్తారని చెప్పారు. పగటి పూటే ఉచిత విద్యుత్, ఆర్బీకే కేంద్రాలంటే గుర్తుకు వచ్చేది జగన్ అని వివరించారు. లంచాలు, వివక్షతకు తావు లేకుండా పథకాలు, పాలన అందిస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు చెప్పుకొనేది ఏముందని జగన్ ప్రశ్నించారు. విద్య, వైద్యం, సామాజిక న్యాయం, మహిళా సాధికారిత గురించి వివరించారు. ఇవన్నీ చూసిన తరువాత వైసీపీకి ఎవరైనా ఓటు వేయకుండా ఉంటారా..తోడుగా నిలబడకుండా ఉండగలరా.. టీడీపీకి ఎవరైనా ఓటు వేస్తారా అని జగన్ ప్రశ్నించారు. ఎక్కడ చూసినా వైసీపీ, జగన్ మార్క్ కనిపిస్తోందని జగన్ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications