వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాలంటీర్లకు జగన్ సెల్యూట్‌- ఉగాది పురస్కారాల ప్రదానం- కీలక వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

ఏపీలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అనుసంధాన కర్తగా ఉన్న వాలంటీర్లకు ఉగాది అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని సీఎం జగన్ ఇవాళ ప్రారంభించారు. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం పోరంకిలోని ఓ ప్రైవేటు రిసార్ట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో జగన్ వాలంటీర్ల సేవలపై ప్రశంసల జల్లు కురిపించారు. కుల, మత, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా వాలంటీర్లు సేవలు అందిస్తున్నారని జగన్ తెలిపారు. అదే సమయంలో విమర్శలకు అతీతంగా పనిచేయాలని వారికి సూచించారు.

Recommended Video

Ap Govt Should Find Other Revenue Sources, Why ? || Oneindia Telugu
వాలంటీర్లకు జగన్ సెల్యూట్‌

వాలంటీర్లకు జగన్ సెల్యూట్‌

ఏపీలో పాలన అంటే ఇలా ఉండాలని దేశమంతా ఏపీ వైపు చూసేలా వాలంటీర్లు పని చేస్తున్నారని సీఎం జగన్ అన్నారు. వాలంటీర్లకు నిండు మనసుతో అభినందనలు చెప్పారు. రూపాయి కూడా లంచం ఆశించకుండా, వివక్ష చూపించకుండా నిస్వార్దంగా, కుల, మతాలు, పార్టీలు, రాజకీయాలు చూడకుండా, వైసీపీకి ఓటేశారో లేదో కూడా చూడకుండా పనిచేస్తున్న వాలంటీర్లకు కృతజ్ఞతలు, సెల్యూట్‌ అంటూ జగన్ ప్రశంసించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న వాలంటీర్లలో 90 శాతానికి పైగా 35 శాతం లోపు వారేనని, 50 శాతం మహిళలే అని, 83 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద వర్గాలే అని జగన్ గుర్తు చేశారు.

 వాలంటీర్ల సేవలకు జగన్‌ ప్రశంసలు

వాలంటీర్ల సేవలకు జగన్‌ ప్రశంసలు

పేదరికం అంటే తెలిసిన వారు, పేదల బాధలు అర్దం చేసుకున్న వారే వాలంటీర్లని సీఎం జగన్ ప్రశంసల వర్షం కురిపించారు. పేదల బాధలు అర్దం చేసుకున్నవారే పేదలకు అలాంటి బాధ రాకుండా చూసే సైనికులు అవుతారని జగన్‌ తెలిపారు. రూపాయి లంచం ఆశించకుండా పెన్షన్‌ అందిస్తున్న గొప్ప సైనికులు వాలంటీర్లన్నారు. 32 రకాల సేవల్ని వాలంటీర్లు అందిస్తున్నారని, కోవిడ్‌ను నియంత్రించే విషయంలో వాలంటీర్ల పాత్ర గొప్పదన్నారు. వాలంటీర్ల సేవల్ని ప్రజలు గుర్తించారని, ప్రభుత్వం కూడా గుర్తించాలని భావించాం, అందుకే అవార్డులు ఇస్తున్నట్లు జగన్ వెల్లడించారు. రాష్ట్రంలోని పలు జిలాల్లో వాలంటీర్లు పించన్ దారులు మరో చోట ఉన్న సరే అక్కడికి వెళ్లి పెన్షన్లు ఇచ్చిన విషయాన్ని సీఎం జగన్‌ సోదాహరణంగా గుర్తు చేశారు.

వాలంటీర్లకు ఉగాది అవార్డుల ప్రదానం

వాలంటీర్లకు ఉగాది అవార్డుల ప్రదానం


రాష్ట్రంలో పనిచేస్తున్న 2.67 లక్షల మంది వాలంటీర్లలో 2.25 లక్షల మందికి ఈసారి ఉగాది పురస్కారాలకు ఎంపిక చేశారు. ఇందులో
సేవా మిత్ర, సేవారత్న, సేవా వజ్ర అనే మూడు విభాగాల్లో వారికి అవార్డులు ఇస్తున్నారు. లెవల్‌ 1లో సేవామిత్ర అవార్డు కింద 2.18 లక్షల మందికి సత్కారంతో పాటు10 వేల నగదు, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్‌ ఇస్తున్నారు. అాలాగే లెవల్‌ 2లో సేవారత్న 4 వేల మందికి సత్కారంతో పాటు 20 వేల నగదు, సర్టిఫికెట్‌, శాలువా, బ్యాడ్జ్‌ ఇవ్వనున్నారు. లెవల్‌ 3లో సేవావజ్ర కింద 875 మందికి సత్కారంతో పాటు 30 వేల నగదు, సర్టిపికెట్‌, శాలువా, బ్యాడ్జ్‌ ఇస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 241 కోట్ల రూపాయలు ఖర్చు
పెడుతున్నట్లు జగన్ తెలిపారు. ఇకపై ప్రతీ సంవత్సరం ఈ పురస్కారాలు కొనసాగుతాయన్నారు. నేటి నుంచి ప్రతీ జిల్లాలో రోజుకో నియోజకవర్గంలో వాలంటీర్లకు ఈ పురస్కారాల ప్రదాన కార్యక్రమాలు ఉంటాయన్నారు.

విమర్శలు పట్టించుకోవద్దన్న జగన్‌

విమర్శలు పట్టించుకోవద్దన్న జగన్‌


క్రమశిక్షణతో మెలిగినంతకాలం ఎలాంటి విమర్శలకూ వెరవొద్దని జగన్‌ వాలంటీర్లకు సూచించారు. పండ్లు పండే చెట్లు మీదే రాళ్లు పడతాయని, వారి పాపానికి వారినే వదిలేయమని సూచించారు. వారి ఖర్మకు వదిలేయమన్నారు. ప్రభుత్వం మాత్రం వాలంటీర్లకు తోడుగా ఉంటుందన్నారు. మీరు చేస్తుంది ఉద్యోగం కాదు సేవ, మీరు చేస్తున్న సేవకు వచ్చే దీవెనలే మీకు ముఖ్యమన్నారు. అవార్డులు అందుకుంటున్న వాలంటీర్లకు సీఎం జగన్ ఆల్‌ ద బెస్ట్‌ చెప్పారు.

English summary
andhra pradesh chief minister ys jagan on today launch ugadi awards to village and ward volunteers in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X