అమరావతి పై సీఎం జగన్ కీలక ప్రకటన, ఇక నుంచి..!!

అమరావతి పై ముఖ్యమంత్రి జగన్ కీలక ప్రకటన చేసారు. ఇక నుంచి అమరావతి సామాజిక అమరావతి..అందరి అమరావతి గా నిలుస్తుందని ప్రకటించారు. ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి 50 వేల మందికి ఇంటి స్థలాలు ఇవ్వటం ఒక చారిత్రక ఘటనగా ముఖ్యమంత్రి అభివర్ణించారు. ఇంటి స్థలాలు ఇవ్వకుండా మారీచులు..రాక్షసులు అడ్డుపడ్డారని చెప్పారు. ఇది పేదల విజయంగా పేర్కొన్న సీఎం జగన్..టీడీపీ అధినేత చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు చేసారు.

అమరావతిలో సీఎం జగన్ :ముఖ్యమంత్రి జగన్ తొలి సారి అమరావతిలో పర్యటించారు. బహరంగ సభలో అమరావతి పైన ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అన్ని వర్గాలను మోసం చేశారని, ఎన్నికలు రాగానే మళ్లీ మోసపూరిత హామీలు ఇస్తారని చెప్పుకొచ్చారు. మోసం చేసే ఆయన్ను నమ్మవద్దని, నరకాసురిడినైనా నమ్మొచ్చుకానీ నారా చంద్రబాబును నమ్మకూడదని అన్నారు.

 amaravthijagan

రూ. 7లక్షల నుంచి రూ. 10 లక్షలు విలువ చేసే ఇంటిస్థలాలను పేద ప్రజలకు ఇస్తున్నామని వివరించారు. ఇవి ఇళ్ల పట్టాలు మాత్రమే కాదు.. సామాజిక న్యాయ పత్రాలుగా పేర్కొన్నారు. రాష్ట్రంలో క్లాస్ వార్ జరుగుతుందని వివరించారు. ఒకవైపు పేదవాడు,మరోవైపు పెత్తందార్లున్నారని చెప్పుకొచ్చారు. పెత్తందార్లు అందరూ ఒక్కటై పేదవాడి ని అడ్డుకుంటున్నారని విశ్లేషించారు. కోర్టులకు వెళ్లి సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందని అంటున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఇక సామాజిక అమరావతి : ఒక్కొక్కరికి 7 నుంచి 10 లక్షలు విలువ చేసే ఇంటిస్థలం మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ జరుగుతుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. వారం రోజుల్లో పట్టాల పంపిణీ పూర్తి చేస్తామని ప్రకటించారు. జులై 8న ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామి ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులకు మూడు అప్షన్లు ఇస్తామన్నారు. సొంతంగా ఇళ్లు కట్టుకుంటే లక్షా 80 వేలు ఇస్తామని చెప్పారు.

ప్రభుత్వం మెటీరియల్ ఇచ్చి నిర్మాణ ఖర్చులు భరిస్తుందని వివరించారు. పూర్తిగా ప్రభుత్వమే కట్టివ్వాలని అడిగినా తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇళ్ల ద్వారా అక్క చెల్లెమ్మలకి 2 నుంచి 3 లక్షల కోట్లు పెడుతున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. టిడ్కో ఫ్లాట్ లను కూడా అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ పాలకుల్లో ఎప్పుడూ ఇలాంటి ఆలోచన చూసారా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

 amaravthijagan

చంద్రబాబు ను నమ్మద్దు : టిడ్కో ఇళ్లను ఒక్క రూపాయికే అందిస్తున్నామని సీఎం చెప్పారు. గత ప్రభుత్వం లో పేదలకు కనీసం ఒక్క సెంటు భూమి ఇవ్వలేదని దుయ్యబట్టారు. 2014 లో చంద్రబాబు వాగ్దానాల పేరుతో అందరినీ మోసం చేశారన్నారు. ఎన్నికలు దగ్గర పడేకొద్దీ మళ్లీ ఎస్సీ,ఎస్టీ,బీసీలపై మోసపూరిత ప్రేమ చూపిస్తున్నారన్నారు. కోవిడ్ లోనూ ఇళ్ల పట్టాల కోసం ముందుకెళ్ళిన అంశాన్ని గుర్తు చేసారు. మేనిఫెస్టో లో 98 శాతం హామీలు అమలు చేసామని చెప్పారు.\

చంద్రబాబు,గజ దొంగల ముఠాకు ఒక దత్తపుత్రుడుకు ఐదేళ్లలో దోచుకువడం పంచుకోవడం దాచుకోవడం మాత్రమే ఉందని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో సంక్షేమం ఎందుకు జరగలేదో ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. ఆర్థికంగా ఎన్ని సవాళ్లు ఎదురైనా కూడా నవరత్నాల్లోని పథకాలు, రైతులు, అక్కచెల్లెమ్మలకు, సామాజిక వర్గాలకు ఇచ్చిన అన్ని హామీలు అమలు చేశామని ముఖ్యమంత్రి వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+